Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 49.5 ఎకరాల భూమి స్వాధీనం
విశాఖ: విశాఖ జిల్లా గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కుటుంబం ప్రభుత్వ భూమిని ఆక్రమించి, నిర్మాణాలు చేశారని పేర్కొంటూ అధికా రులు వాటిని కూల్చివేశారు. ఆదివారం తెల్లవారు జాము రెండు గంటల ప్రాంతంలో నిర్మాణాల వద్దకు వచ్చిన రెవిన్యూ అధికారులు పోక్లైనర్లతో వాటిని కూల్చివేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కార్యక్రమ జరిగింది. విశాఖ ఆర్‌డిఒ పి.కిశోర్, గాజువాక తహశీల్దార్ ఎంవి.లోకేశ్వరరావు తదితరులు ఈ కూల్చివేతను పర్యవేక్షించారు. అధికారులు చెబుతున్న సమాచారం ప్రకారం తుంగ్లాం, గొల్లజగ్గరాజుపేట, కూర్మన్నపాలెం రెవెన్యూ పరిధిలో 49.5 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైంది. ప్రభుత్వ భూమితో పాటు, స్టీల్‌ప్లాంట్, ఎపిఐఐసి, అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములను ఆక్రమించి నట్లు అధికారులు చెప్పారు. ప్రభుత్వ భూమి రికార్డులను తారుమారు చేసి పల్లా కుటుంబ సభ్యులకు అప్పటి గాజువాక తహశీల్దార్ వేణుగోపాల్, ఉప తహశీల్దార్ చేతన్ పాసు పుస్తకాలు అందజేసినట్లు అధికారులు గుర్తించారు. అయితే, అధికారులు చెబుతున్న విషయాలను పల్లా శ్రీనివాసరావు సోదరుడు శంకరరావు ఖండిం చారు. ఆభూమిని 1992లో తాము కొనుగోలుచేసినట్లు ఆయన చెప్పారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండి తెల్లవారుజామున నిర్మాణాలను కూల్చివేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తన సోదరుడు పల్లా శ్రీనివాసరావును వైసిపిలో చేరమని ఒత్తిడి చేశారని, దానికి అంగీకరించకపోవడంతో ఈ తరహా దాడులకు దిగారని ఆయన అరోపించారు. అధికారుల చర్యలను న్యాయస్థానంలో సవాల్ చేస్తానని ఆయన చెప్పారు. గాజువాక మండలంలో ఆదివారం స్వాధీనం చేసుకున్న ఈ భూముల విలువ 791.41 కోట్ల రూపాయలు ఉంటుందనిచెందిన ఉన్నతాధికారులు చెప్పారు. ఇప్పటి వరకు విశాఖలో 430.81 ఆక్రమతణలు గుర్తించి,స్వాధీనం చేసుకున్నామని వీటి విలువ 4,291.41 కోట్ల రూపాయలని వారు వివరించారు.