Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్చలకు ఆహ్వానించనున్న కేంద్రం..!
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను పునరుద్ధరించేందుకు, అక్కడ తిరిగి రాజకీయ కార్యకలాపాలు కొనసాగించేందుకు స్థానిక రాజకీయ నేతలతో కేంద్రం చర్చలు ప్రారంభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అక్కడ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జమ్ముకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఏడు పార్టీలు కలిసి ఏర్పడిన గుప్కార్ కూటమి (పిఎజిడి) చర్చల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై చర్చించనున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్ తెలిపింది. 2018లో మెహబూబా ముఫ్తీ ప్రభుత్వానికి బిజెపి మద్దతు ఉపసంహరించుకోవడంతో.. ప్రభుత్వం కూలిపోయింది. ఆ తరువాత రాష్ట్రపతి పాలనలోకి వెళ్లింది. అప్పటి నుండి అక్కడ రాజకీయ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అనంతరం ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. 2019లో ఎన్నికలు నిర్వహిస్తారని భావించినప్పటికీ... భద్రతా కారణాలు చెప్పి ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించేందుకు నిరాకరించింది.
ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ, ప్రత్యేక హోదాపై స్థానిక రాజకీయ నేతలతో కేంద్రం చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తాము చర్చలకు సిద్ధంగా లేమని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, గుప్కార్ కూటమి చీఫ్ ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని భారత్‌పై అమెరికా ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలోనే మోడీ సర్కార్ చర్చలకు సిద్ధమౌతున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని బైడెన్ పాలనాధికారి ఒకరు తెలిపారు. కాశ్మీర్లో వీలైనంత సాధారణ పరిస్థితులకు తీసుకురావాలని, అక్కడ 4జిని పునరుద్ధరించాలని, ఖైదీలను విడుదల చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరినట్లు దక్షిణ, మధ్య ఆసియా తాత్కాలిక అసిస్టెంట్ డీన్ థాప్సన్ ఓ సందర్భంలో తెలిపారు.