Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, కార్మికులందరికీ కోవిడ్ నియంత్రణ టీకాల కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. విద్యుత్ సౌధలో ఈ కార్యక్రమాన్ని టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు ప్రారంభించారు. మింట్ కాపౌండ్‌లోని టీఎస్ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సీఎమ్‌డీ జి రఘుమారెడ్డి ప్రారంభించారు. ఆర్టిజన్లు సహా సంస్థలోని 50వేల మందికీ ఉచితంగా టీకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని వారు తెలిపారు. విద్యుత్ ఉద్యోగులను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించిన విషయాన్ని ప్రస్తావించారు. తొలి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో ఇస్తారని తెలిపారు. త్వరలోనే పెన్షనర్లు, ఉద్యోగుల కుటుంబసభ్యులకు కూడా ఉచితంగా టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామనీ, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని సీఎమ్‌డీలు వివరించారు. కార్యక్రమాల్లో ఆయా సంస్థల డైరెక్టర్లు పాల్గొన్నారు.