Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు డీఈవోలకు స్థానచలనం
- నలుగురు అధికారులకు పదోన్నతి
- మరో నలుగురికి డీఈవోలుగా అదనపు బాధ్యతలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పాఠశాల విద్యాశాఖలో భారీగా బదిలీలు జరిగాయి. ఇద్దరు డీఈవోలకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. డిప్యూటీ డైరెక్టర్/జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో)గా నలుగురు అధికారులకు పదోన్నతి లభించింది. మరో మరో నలుగురు అధికారులకు డీఈవోలుగా అదనపు బాధ్యతలను అప్పగించింది. పదోన్నతులకు సంబంధించి జీవో నెంబర్ 17, బదిలీలు, సర్దుబాటుకు సంబంధించి జీవో నెంబర్ 68ని విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర విద్యా సర్వీసు నిబంధనలు -1996 ప్రకారం నలుగురికి పదోన్నతులు కల్పించామని తెలిపారు. ఎస్ యాదయ్య, పి అనురాధారెడ్డి, చైతన్యజైనీ, నండూరి సత్య సూర్యప్రసాద్ పదోన్నతి పొందారని వివరించారు. ఖమ్మం డీఈవోగా ఎస్ యాదయ్య, భద్రాద్రి కొత్తగూడెం డీఈవోగా పి అనురాధారెడ్డి, ఎస్సీఈఆర్టీ డిప్యూటీ డైరెక్టర్గా చైతన్య జైనీ, మోడల్ స్కూల్స్ డిప్యూటీ డైరెక్టర్గా నండూరి సత్య సూర్యప్రసాద్ను నియమించామని పేర్కొన్నారు.