Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఇటీవల ముగిసిన జీ7 సమ్మిట్‌లో భాగంగా సంయుక్త ప్రకటనపై సంతకం చేసింది. ఇది 'ఆన్లైన్, ఆఫ్‌లైన్ మానవ హక్కులను', 'భావప్రకటనా స్వేచ్ఛ'ను సమర్థిస్తుంది. ఈ ప్రకటన 'రాజకీయంగా ప్రేరేపించబడిన ఇంటర్నెట్ షట్డౌన్లను' స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి ముప్పుగా పేర్కొంది. అయితే, భారత్‌తో పాటు జీ7 సభ్యదేశాలు ఈ సంయుక్త ప్రకటను ఆచరిస్తాయా? అన్నదానిపై జాతీయ, అంతర్జాతీయ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఆయా దేశాల్లో పలు సందర్భాల్లో చోటు చేసుకున్న సంఘటనలు, వాటి విషయంలో ఆయా దేశాల ప్రభుత్వాలు వ్యవహరించిన తీరును వారు ఉదహరించారు. భారత్ విషయానికొస్తే.. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 155 ఇంటర్నెట్ షట్డౌన్లు నమోదయ్యాయి. అయితే, ఇందులో ఒక్క భారత్ నుంచే 109 వరకు ఉన్నాయని విశ్లేషకులు తెలిపారు. ఇలాంటి షట్డౌన్లతో భారత్‌లో ముఖ్యంగా జమ్మూకాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, సీఏఏ, రైతు నిరసనల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న ప్రజలు, నిరసనకారులు, సామాజిక కార్యకర్తలు,విద్యావేత్తలు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని వారు గుర్తు చేశారు. జీ7 సమ్మిట్‌కు అతిథి దేశంగా భారత్ హాజరైన విషయం తెలిసిందే. ఇందులో ప్రధాని మోడీ సైబర్ స్పేస్‌లో 'ప్రజాస్వామ్య విలువలు' కావాలని అభ్యర్థించిన విషయం తెలిసిందే. అయితే, భారత్‌తో పాటు జీ7 సభ్యదేశాల ఇలాంటి ప్రకటనలు నీటి మీద రాతల వంటివేనని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.