Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్‌లో రూ.100దాటిన పెట్రోల్
- ధరలు తగ్గించాలని 15రోజులపాటు వామపక్షాల నిరసనలు
న్యూఢిల్లీ : ప్రతిరోజూ ఇంధన ధరల్ని పెంచుతూ మోడీ సర్కార్ సామాన్యుడ్ని హడలెత్తిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ (రూ. 100.20) కొట్టింది. గతకొద్ది రోజులుగా ఇంధన ధరలు రికార్డుస్థాయిలో పెరు గుతూ.. వాహనదారులకు చుక్కలు చూపి స్తున్నాయి. ఒక రోజు విరామం తర్వాత సోమవారంనాడు లీ.పెట్రోల్ 29 పైసలు, లీ.డీజిల్‌పై 31పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయించాయి. కరోనా కష్టకాలంలో ఇదే ధరల మోత? పప్పు, ఉప్పు, బియ్యం, వంట నూనె..ఇలా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే, కేంద్రానికి ఇదేమీ పట్టదా? అని సామాన్యుడు ఆవేదన చెందుతున్నాడు. ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నాయి. జూన్16 నుంచి 30 వరకు 15రోజులపాటు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో నిరసనలకు దిగుతున్నామని వామపక్షాలు ప్రకటించాయి. ఇంధన ధరల్ని తగ్గించాలని డిమాండ్ చేశాయి. ముంబయిలో పెట్రోల్ ఆల్‌టైం గరిష్టస్థాయి రూ.102.58ను తాకింది. అటు హైదరాబాద్‌లో లీ.పెట్రోల్ రూ.100.20, డీజిల్ రూ.95.14 వద్దకు చేరాయి. దేశంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, లడఖ్ సహా ఏడు రాష్ట్రాల్లో పెట్రోల్ లీటర్ ధర రూ.వంద మార్కును దాటింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంధన ధరల పెంపు మొదలైంది. మే 4 నుంచి ఇప్పటివరకు ధరలు పెరగటం ఇది 25వసారి.