Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామజన్మభూమి పేరుతో బీజేపీ మతరాజకీయం చేస్తూనే ఉన్నది. హిందూత్వముసుగులో ఎన్నో అనర్థాలకు పాల్పడు తున్న ఘటనలెన్నో. తాజాగా కమలంపార్టీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో రామునిపేరుతోనే మనీలాండరింగ్‌కు దిగింది. అది ఇపుడు దేశవ్యాప్తంగా హల్చల్గా మారింది. కేవలం ఐదు నిమిషాల్లో రెండు కోట్లు విలువచేసే భూమి కాస్త ఏకంగా 18.5 కోట్లకు ఎగబాకింది. ఈ లెక్కన 16.5కోట్లు క్విడ్‌ప్రోకో (నీకది..నాకిది) జరిగినట్టు స్పష్టమవుతున్నది. బీజేపీ, ట్రస్ట్ పెద్దలు మధ్య వాటాల మూటలు చేతులు మారాయన్న కథనాలు రామభక్తుల్లో అలజడి రేపుతున్నాయి.
-రామమందిరం పేరుతో బిగ్‌డీల్
- రెండు కోట్ల భూమి 18.5 కోట్లకు..
- ట్రస్ట్ పెద్దలు, బీజేపీ నేతల మనీలాండరింగ్
- రామభక్తుల్లో అలజడి
లక్నో : అయోధ్యలో రామమందిరం కట్టడానికి మోడీ ప్రభుత్వం తమకు అనుకూలమైన విధానాలెన్నో అమలుచేసింది. రాముని గుడి కడుతున్నామనగానే.. చిన్నపిల్లలు మట్టికుండల్లో దాచుకున్న చిల్లరపైసలతో సహా విరాళంగా ఇచ్చారు. బీజేపీ నేతలు కూడా ఇంటింటికీ తిరిగి విరాళాలు సేకరించారు. మనం ఇచ్చే విరాళాలు సద్వినియోగమవుతాయా.. లేదా అని ఆలోచించకుండా రామమంది రం కోసం సమర్పించుకున్నారు. కార్పొరేట్లు తమ అవసరాలకోసం మోడీ సర్కారును మెహర్బానీ చేసుకోవటానికి మందిర నిర్మాణానికి కోట్లు ఇచ్చారు. ఇలా ఇచ్చిన విరాళాలపైనే బీజేపీ, ట్రస్ట్ పెద్దల కన్నుపడింది. కోట్ల సొమ్మును కాజేయాలని వేసిన క్విడ్‌ప్రోకో ఇపుడు బహిర్గత మైంది.
డీల్‌లో నలుగురు కుసుమ్పాఠక్ హరీశ్ పాఠక్, రవిమోహన్ తివారి, సులాన్ అంసారీ.
అయోధ్యలో సర్వె నెంబర్లు 243,244,246 లో భూమి ఉన్నది. ఈ భూమి యాజమానులైన కుసుమ్పాఠక్,హరీశ్ పాఠక్ నుంచి రియాల్టర్ సుల్తాన్ అంసారీ, అతని సహచరుడు రవి మోహన్ తివారీ మార్చి 18న కొనుగోలు చేశారు. దీనికి ఇద్దరు సాక్ష్యులుగా ఉన్నారు. ఒకరు అనిల్ మిశ్రా (రామ జన్మభూమి ట్రస్టు సభ్యుడు) మరొకరు హృషికేశ్ ఉపాధ్యాయ( అయోధ్యమేయర్). వాస్తవానికి ఆ భూమి విలువ 5.80కోట్లు కాగా,వారిపై వత్తిడి తెచ్చి రెండు కోట్లకు డీల్ సెట్ చేశారు. స్వయంగా అయోధ్యమేయర్ సాక్షిగా ఉండటం.. రామజన్మ భూమి ట్రస్టు సభ్యుడు కూడా ఉండటంతో రాజకీ యం బెదిరింపులు జరిగిఉండొచ్చని తెలిసింది. అలా రెండుకోట్లను కొన్నట్టు దస్తావేజులు రాయించుకు న్నారు. అపుడు కేవలం ఐదు నిమిషాల్లోనే మరో డీల్ కుదిర్చారు. ఆ భూమిని రూ.18.5 కోట్లకు కొనే సింది. దస్తావేజులపై సుల్తాన్ అంసారీ, రవితివారీ, చంపత్ రారు (వీహెచ్పీనేత, ట్రస్ట్ ప్రధానకార్య దర్శి) సంతకాలు చేశారు.క్విడ్‌ప్రోకో జరిగాక ఈ బాగోతం జరిగిందని స్పష్టమవుతున్నది. ఆర్జీజీఎస్ ద్వారా అకౌంట్లో 17 కోట్లు రియల్టర్ సుల్తాన్ అంసారీ ఖాతాలో జమ అయిపోయాయి.
డీల్ గురించి ప్రశ్నిస్తే..
తక్కువ ధర ఉన్న భూమిని అంత ఖరీదుగా ఎలా కొనుగోలు చేస్తారని మీడియా ప్రశ్నిస్తే.. మందిర నిర్మాణంలో అవకతవకలపై ఆరోపణలు వస్తూనే ఉం టాయి. సమాధానమివ్వాల్సిన అవసరం లేదంటూ చంపత్రారు (మందిర్ ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ) దాట వేశారు. మహాత్మగాంధీ హత్య జరిగినప్పటినుంచి ఆరోపణలు వస్తూనే ఉన్నాయంటూ దాటవేసేప్ర యత్నం చేశారు. మందిరానికి సేకరించిన విరాళాలు ఎవరిచ్చారు.! ఎవరినుంచి ఎంతెంత వచ్చిందని చంపత్ రారును ఎన్డీటీవీ ఇంటర్వ్యూ చేసింది. బుద్ధి లేని వారే వెనకుండి ఇలాంటి ప్రశ్నలు వేయిస్తున్నా రంటూ దాటవేశారు. ఇక అనిల్మిశ్రాను మీడియా నిలదీస్తే.. ఆయన కూడా సమాధానమివ్వకుండా జారుకున్నారు.
భక్తులిచ్చిన విరాళాలంటే అంత నిర్లక్ష్యమా..!
ఎక్కడైనా భూమి కొనాలనుకుంటే..పక్కనే ఉన్న భూముల రేట్లు ఎంత ఉన్నాయి.! పలు విధాలుగా ఆలోచిస్తాం. అలాంటి రామునిపేరు చెప్పి కోట్లు విరా ళాలుగా ఇస్తే ట్రస్ట్ అంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవ హరిస్తుంది..? రాముని పేరు చెప్పుకుని కోట్లు మింగే సిన పెద్దల గురించి ప్రతిపక్షపార్టీలు ప్రశ్నిస్తున్నాయి. పీఎం ఫండ్ ఉన్నా..పీఎం కేర్స్ పెట్టింది మోడీ ప్రభుత్వం.
దానికి వచ్చే విరాళాలెంతో ఇప్పటికీ మిస్టరీ. పైగా ఆ ఫండ్‌కు ఇచ్చే దాతల పేర్ల వెల్లడికి ఆర్టీఐకు అధికారంలేకుండా చేసింది. ఇపుడు రామజన్మభూమి ట్రస్టు పేరుతో వేలకోట్లు వసూలు చేసి, దానికి లెక్కాపత్రం లేకుండా చేసేసింది. వచ్చిన విరాళాలకు సరైన ఆడిట్ లేకపోవటంతో యూపీలో పెద్దలంతా కుమ్మక్కై మనీలాండరింగ్‌కు పాల్పడుతు న్నట్టు అవగతమవుతున్నది. రామమందిర నిర్మాణం కోసం సేకరించిన భూములన్నింటిపైనా సీబీఐ విచారణ జరపాలంటూ ప్రతిపక్షపార్టీలు డిమాండ్ చేస్తు న్నాయి. తిన్నా తినకపోయినా విరాళాలిచ్చిన రామ భక్తులు మాత్రం అయ్యో రామా.. అంటూ లోలోన బాధపడిపోతున్నారు.