Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ సోనీ సరికొత్తగా బ్రెవియా ఎక్స్ఆర్ ప్రాసెసర్‌తో ప్రపంచంలోనే తొలి కాగ్నిటివ్ ఇంటిలిజెన్స్ టెలివిజన్‌ను ఆవిష్కరించినట్టు ఆ కంపెనీ వెల్లడించింది. గూగుల్ టీవీ వాయిస్ సెర్చ్‌తో అంతులేని వినోదాన్ని అందిస్తుందని పేర్కొంది. 75 అంగుళాల పరిమాణంలో లభించే ఈ టీవీ ధరను రూ.1,39,990గా నిర్ణయించినట్టు తెలిపింది. పరిసర ఆప్టిమైజేషన్, ఎకోస్టిక్ ఆటో కాలిబరేషన్ టెక్నాలజీతో ప్రతీ ఒక్క వాతావరణంలో అత్యుత్తమమైన చిత్రాలు, ధ్వని దీని ప్రత్యేకతలని పేర్కొంది.