Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా, లాక్డౌన్ నిబంధనలతో ప్రస్తుత ఏడాది మేలో రిటైల్ అమ్మకాలు 79 శాతం క్షీణించాయని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఏఐ) సర్వేలో వెల్లడైంది. 2019 మే మాసం అమ్మకాలతో పోల్చితే వ్యాపారాలు భారీగా పడిపోయాయి. గడిచిన మే మాసంలో ముఖ్యంగా పశ్చిన, ఉత్తరాది ప్రాంతాల్లో రిటైల్ అమ్మకాలు 83 శాతం పతనమయ్యాయి. ప్రస్తుత మాసంలో అమ్మకాలు పెరగొచ్చని వ్యాపారస్తులు ఆశాభావంతో ఉన్నారని ఆర్ఏఐ సీఈఓ కుమార్ రాజ గోపాలన్ పేర్కొన్నారు.