Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కరోనా టీకాల దుష్ప్రభావాలపై అధ్యయనం చేస్తున్న ప్రభుత్వ ప్యానెల్.. దేశంలో వ్యాక్సిన్ తీసుకోవడంతో సంభవించిన తొలి మరణాన్ని అధికారికంగా ధ్రువీకరించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుంచి మార్చి 31 మధ్య కాలంలో టీకా తీసుకున్న ముగ్గురు టీకా దుష్ప్రభావం కారణంగా అనఫిలాక్సిస్కు గురయ్యారు. వీరిలో 68 ఏండ్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారని పేర్కొంటున్న నిపుణుల బృందం రిపోర్టును ఊటంకిస్తూ.. హిందుస్తాన్ టైమ్స్ వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మరణించిన 31 మందిలో కలిగిన తీవ్ర దుష్ప్రభావాలపై ఈ కమిటీ అధ్యయనం చేసింది. అందులో ఒక వ్యక్తి మాత్రం అనఫిలాక్సిస్ వల్ల చనిపోయినట్టు తేల్చింది.
ఆ వ్యక్తి మార్చి 8న వ్యాక్సిన్ తీసుకున్నాడని రిపోర్టులో పేర్కొంది. వ్యాక్సినేషన్ తర్వాత కలిగే అనఫిలాక్సిస్ వల్ల చనిపోయిన తొలి వ్యక్తిగా కమిటీ తేల్చింది. అనఫిలాక్సిస్ ఒక తీవ్రమైన ఎలర్జీ. నిజానికి మరో ముగ్గురు కూడా వ్యాక్సిన్ వల్లే చనిపోయినా.. ప్రభుత్వం మాత్రం ఇదొక్క మరణాన్నే ధ్రువీకరించింది. వ్యాక్సిన్ సంబంధిత ఇలాంటి రియాక్షన్లు ముందుగా ఊహించినవేనని ప్యానెల్ అభిప్రాయపడింది. కాగా, ఫిబ్రవరి5-మార్చి31 మధ్య కాలంలో దేశంలో 5.9 లక్షలకు పైగా లబ్దిదారులు కరోనా టీకా డోసులు తీసుకున్నారు. ఈ కాలంలో టీకా దుష్ప్రభావ సంబంధిత ఇతర అనారోగ్య కారణాలతో మొత్తం 28 మంది మరణించారు. అనాఫిలాక్సిస్కు గురైన వ్యక్తులలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు చికిత్స అనంతరం కోలుకున్నారు.