Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు
న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో 17,51,358 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..60,471 మందికి పాజిటివ్‌గా తేలింది. అలాగే గత 24 గంటల వ్యవధిలో 2,726 మంది మరణించారు. కొత్త కేసులతో కలుపుకొని దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 2,95,70,881కు పెరిగింది. 3,77,031 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 38కోట్లకుపైగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
ప్రస్తుతం దేశంలో 9,12,378 మంది కరోనాతో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 3.30 శాతానికి తగ్గింది. గడిచిన 24 గంటల్లో 1,17,525 మంది కోలుకోగా.. రికవరీ రేటు 95.43 శాతానికి పెరిగింది. మొత్తంగా 2,82,80,472 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మరోపక్క గడిచిన 24 గంటల్లో 39,27,154 వ్యాక్సిన్ డోసులు అందించగా, ఇప్పటి వరకు 25,90,44,072 డోసులు పంపిణీ అయినట్టు కేంద్రం వెల్లడించింది.