Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 21న దేశవ్యాప్త ఆందోళనలకు ఏఐఎడబ్ల్యూయూ, డీఎస్ఎంఎం పిలుపు
న్యూఢిల్లీ: ఉపాధి హామీ పథకంలో కుల విభజనకు వ్యతిరేకంగా 21న దేశవ్యాప్త ఆందోళనలకు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐఎడబ్ల్యూయూ), దళిత శోషణ్ ముక్తి మంచ్ (డీఎస్ఎంఎం) పిలుపు ఇచ్చాయి. ఈ మేరకు ఆయా సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.వెంకట్, ఎ. విజయ రాఘవన్ (ఏఐఎడబ్ల్యూయూ), కె. రాధాకృష్ణన్, రామ్ చంద్ర డోమ్ (డీఎస్ఎంఎం) సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు ప్రత్యేక ఫండ్ పేరుతో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జారీ చేసిన మెమోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కార్మికులను షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతరులు అని వర్గీకరించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చిన ఉత్తర్వులు దారుణమని పేర్కొన్నారు. ఒకే వేతనానికి అర్హత ఉన్న కార్మికులను వివిధ కుల వర్గాలుగా విభజించడానికి ఎటువంటి హేతుబద్ధత లేదని అన్నారు. ఇది వేతనాల చెల్లింపును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని తెలిపారు. చెల్లింపు పద్ధతి మారినప్పుడల్లా చెల్లింపుల్లో ఆలస్యానికి కారణమవుతున్నదని పేర్కొన్నారు. సంక్లిష్టమైన చెల్లింపు ప్రక్రియను సరళీకృతం చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ప్రభుత్వం దానికి విరుద్దంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు ఉపాధి హామీ చట్టం ప్రాథమిక అవగాహనతో పాటు సమాన వేతనాల చట్టాన్ని ఉల్లంఘిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర చట్ట విరుద్ధమైన ఈ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలనీ, అలాగే అన్ని కుటుంబాలకు సకాలంలో వేతనాలు చెల్లించడంతో పాటు 200 రోజుల పని కల్పించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ. 600 ఇచ్చేందుకు బడ్జెట్ కేటాయింపులు చేయాలని కోరారు.
సేవ్ అగ్రికల్చర్, సేవ్ డెమోక్రసీ'
ఆందోళలకు కార్మిక సంఘాలు మద్దతు
మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతు చేస్తున్న ఆందోళనకు ఏడు నెలలు కావొస్తున్న నేపథ్యంలో 26న సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఇచ్చిన 'సేవ్ అగ్రికల్చర్, సేవ్ డెమోక్రసీ' ఆందోళలకు కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. మంగళవారం ఈ మేరకు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఏఐసీసీటీయూ, యూటీయూసీ, ఎల్పిఎఫ్, ఎస్ఈడబ్ల్యూఎ సంఘాలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. ఎస్కేఎం పిలుపుకు మద్దతుగా ''దేశం సంఘీభావం'' పేరుతో ఆందోళనకు పది కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ (సవరణ) బిల్లును ఉపసంహరించుకోవాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రాజధాని ఢిల్లీలోకి వెళ్లే ప్రధాన రహదారులపై రైతుల ఆందోళన 200 రోజులుగా నిరంతరం కొనసాగుతున్నది. ఈ క్రమంలో 500కు పైగా రైతు సోదరులను కోల్పోయారు. తీవ్రమైన చలి, ఎండ, వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఆందోళన కొనసాగిస్తున్నారని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. జూన్ 26న దేశవ్యాప్తంగా జిల్లా, మండల స్థాయి నిరసనలతో పాటు రాష్ట్రాల్లోని రాజ్ భవన్ల వద్ద ఆందోళనల్లో పాల్గొనాలని పిలుపు ఇచ్చాయి.
కార్మిక సంఘాల డిమాండ్లు
1. నాలుగు లేబర్ కోడ్స్, మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్ (సవరణ) బిల్లు రద్దు చేయాలి.
2. రైతు ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చట్టబద్ధంగా హామీ ఇవ్వాలి.
3. నిర్దిష్ట కాల వ్యవధిలో యూనివర్సల్ ఉచిత టీకా అందించాలి.
4. ప్రతి పేదవారికి నెలకు 10 కిలోల ఉచిత ఆహార ధాన్యాలు, ప్రతి నెల ఆదాయ పన్ను పరిధిలోకి రాని కుటుంబానికి రూ.7,500 ఇవ్వాలి.
5. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ విభాగాల ప్రైవేటీకరణ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి.
6. రైల్వే, రోడ్డు రవాణా, బొగ్గు, రక్షణ, సెయిల్, భెల్, టెలికాం, పోస్టల్ సర్వీసెస్, బ్యాంకులు, భీమా, విద్యుత్, నీరు, విద్య, ఆరోగ్య సేవలు, ఇపిఎఫ్ఓ, పోర్ట్, డాక్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను ఫ్రంట్లైన్ సిబ్బందిగా పరిగణించాలి. తదనుగుణంగా పరిహారం ఇవ్వండి.
7. ఆశా, అంగన్వాడీ ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులతో సహా అన్ని ఫ్రంట్లైన్ కార్మికులకు రూ.50 లక్షల భీమా కల్పించాలి. కరోనా కారణంగా మరణించిన కార్మికుల కుటుంబాలకు తగిన పరిహారం ఇవ్వాలి.