Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'వరల్డ్ ప్రెస్ ఫ్రీడం' సూచికలో భారత్‌కు 142వ ర్యాంక్
- జర్నలిస్టులకు భారత్ అత్యంత ప్రమాదకర దేశమని నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : పార్లమెంటరీ ప్రజాస్వామ్య పాలనా విధానంలో ఉన్న భారత్‌కు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, నియంతృత్వం దిశగా వెళ్తోం దని పలు అంతర్జాతీయ నివేదికలు హెచ్చరిస్తు న్నాయి. తాజాగా ఒక అధ్యయనం కూడా భారత్‌లో ప్రజాస్వామ్య విలువలు పడిపోతున్నాయని వెల్లడిం చింది. 'వరల్డ్ ప్రెస్ ఫ్రీడం-2021' సూచికలో భారత్‌కు 142వ ర్యాంకు దక్కింది. ఫ్రాన్స్‌కు చెందిన 'రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్' అనే ఎన్జీఓ సంస్థ 180 దేశాలపై ఈ నివేదిక విడుదలచేసింది. పాత్రికేయులు స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితులు భారత్‌లో లేవని నివేదిక అభిప్రాయపడింది. జర్నలిస్టులకు అత్యంత ప్రమాదకర దేశాల్లో భారత్ ఒకటని తెలిపింది. ఈ ఏడాది మార్చిలో అమెరికాకు చెందిన 'ఫ్రీడం హౌస్' అనే సంస్థకూడా భారత్‌లో ప్రజాస్వామ్యం దెబ్బతిం టోందని ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ ర్యాంకును తగ్గిస్తూ నివేదిక విడుదల చేసింది. భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని మోడీ సర్కార్ 'నియంతృత్వం' వైపునకు తీసుకెళ్తోందని 'ఫ్రీడం హౌస్' తెలిపింది. పార్లమెంటరీ పాలన, ఎన్నికల సంఘం, అవినీతి నిరోధక సంస్థలు, స్వతంత్ర సంస్థల పనితీరు ఆధా రంగా, పత్రికా స్వేచ్ఛ ఆధారంగా అంతర్జాతీయంగా వివిధ సంస్థలు నివేదికలు రూపొందిస్తున్నాయి. ఈ నేప థ్యంలో భారత్‌లో ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థ, పౌర హక్కులు, అవినీతి, పత్రికా స్వేచ్ఛ..తదితర అంశాల్ని పరిగణలోకి తీసుకొని ర్యాంకులు ప్రకటిస్తు న్నాయి. తాజా నివేదిక ప్రకారం, భారత్‌లో ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయటం లేదనే అనుమానం వ్యక్తమైంది. ఇందుకు తాజా ఉదాహరణగా.. పశ్చిమ బెంగాల్లో 8దశల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహించటం. కేంద్రంలోని పాల కుల రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్నికల సంఘం సుదీర్ఘమైన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందనే అనుమానాలున్నాయి. ప్రధాని మోడీ సహా బీజేపీ నాయకులు అన్ని నియోజికవర్గాల్లో తిరిగి ప్రచారం చేసుకునేలా ఎన్నికల షెడ్యూ ల్ను విడుదల చేశారని ఎన్నికల సంఘంపై ఆరోపణలున్నాయి. ఇదంతా కూడా ఎన్నికల సంఘం స్వతంత్రను ప్రశ్నార్థకం చేసిందని నిపుణులు చెబుతున్నారు. అలాగే మనదేశంలో న్యాయవ్యవస్థ పనితీరు స్వతంత్రంగా లేదని గతకొంత కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘనలు, ఆర్టికల్ 370 రద్దు..పలు కీలక పిటిషన్లు నెలలకొద్దీ సుప్రీంలో పెండింగ్ ఉండటం వెనుక మోడీ సర్కార్ ఉందని ఆరోపణలున్నాయి.