Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 60 శాతం గ్రామీణానికి వ్యాక్సిన్ గురించి తెలియదు !
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. కొత్తగా కరోనా బారినపడుతున్న వారితో పాటు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అధికంగానే ఉంటోంది. దీనిని అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెరగడం లేదు. దీనికి వ్యాక్సిన్ కొరతతో పాటు టీకా నమోదు ప్రక్రియలో తమ పేర్లను ఎలా నమోదు చేసుకోవాలనే విషయాలతో పాటు మరిన్ని అంశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియకు అవరోధంగా మారాయి. వ్యాక్సినేషన్ నేపథ్యంలో డిజిటల్ డివైడ్కు సంబంధించిన అంశాలపై ఇదివరకే సుప్రీంకోర్టు అనేక అంశాలను గుర్తుచేస్తూ కేంద్రానికి పలు సూచనలు చేసింది. తాజాగా దీనికి సంబంధించి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ చేపట్టిన సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. అందులోని వివరాల ప్రకారం.. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో టీకాల నమోదుకోసం తీసుకువచ్చిన కోవిన్లో ఎలా రిజిస్టర్ కావాలో 63 శాతం మందికి, చిన్న పట్టణాల్లో 43 శాతం మంది తెలియదు.