Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : వరుసగా నాలుగు రోజులుగా లాభాల్లో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్ల ర్యాలీకి తెర పడింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, లోహ, బ్యాంకింగ్ షేర్ల ప్రతికూలతతో బుధవారం సెషన్లో నష్టాలను ఎదుర్కొన్నాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 271.07 పాయింట్లు క్షీణించి 52,502కు పడిపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 102 పాయింట్ల నష్టంతో 15,768 వద్ద ముగిసింది. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.95 శాతం, స్మాల్ క్యాప్ 0.68 శాతం చొప్పున తగ్గాయి.