Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివరణనిచ్చేందుకు కేంద్రం నిరాకరణ
న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్ పదవీ కాలాన్ని ఏకపక్షంగా మార్చడం వెనుక కారణాలను బహిర్గతం చేసేందుకు కేంద్రం నిరాకరించింది. గతంలో ఈ పదవీ కాలం సుమారు రెండేండ్లు ఉండగా... ఇప్పుడు తదుపరి ఆదేశాల వరకు అనే పదాలను చేర్చడంతో అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. అంతకముందు సీబీఐ చీఫ్లుగా అనిల్ సిన్హా, అలోక్ వర్మ, రిషి కుమార్ శుక్లా లను నియమించే సమయంలో మోడీసర్కార్ గత నిబంధనలు పాటించగా... నూతనంగా నియమించిన సుబోధ్్ కుమార్ శుక్లాకు మాత్రం తదుపరి ఆదేశాల వరకు అని పేర్కొంది. మే 25న డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) జారీ చేసిన ఆదేశాల్లో 'కేంద్ర కమిటీ ఏర్పాటు చేసిన ప్యానల్ సిఫారసు మేరకు సుబోధ్ను రెండేండ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు (ఏదీ ముందు అయితే ఆ ఉత్తర్వు ఆధారంగా) సీబీఐ నూతన డైరెక్టర్గా నియమిస్తున్నాం' అని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుపై హర్యానాకు చెందిన ఆర్టీఐ కార్యకర్త హేమంత్ కుమార్ ఈ వ్యాఖ్యల వెనుక అర్థమేమిటో సమాచారమివ్వాలని కోరగా... మీరు అడిగిన సమాచారం... సమాచార హక్కు చట్ట పరిధిని మించి ఉందని, వివరాలు అందించలేమని చెప్పింది.