Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపు ప్రారంభించనున్న ప్రధాని
న్యూఢిల్లీ: కోవిడ్ మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆరోగ్య కార్యకర్తల కొరత తీర్చాలని కేంద్రం నిర్ణయించింది. వైద్య, ఆరోగ్య రంగంలో ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కోవిడ్ ఫ్రంట్లైన్ వర్కర్లకు శిక్షణ ఇచ్చేందుకు క్రాష్ కోర్సును ప్రవేశపెట్టింది. 18న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం 3.0 కింద 'కస్టమైజ్డ్ క్రాష్ కోర్స్ ప్రోగ్రామ్ ఫర్ కోవిడ్ 19 ఫ్రంట్లైన్ వర్కర్స్' పేరిట సుమారు లక్ష మందికి పైగా శిక్షణ ఇవ్వనున్నట్టు కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లోని 111 కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపింది.
730మంది వైద్యులు మృతి... బీహార్లో అత్యధికం : ఐఎంఏ
కరోనా వైరస్ సెకండ్ వేవ్ సృష్టించిన విలయంతో దేశవ్యాప్తంగా 730మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయినట్టు ఇండియన్ మెడికల్ ఆసోసియేషన్ (ఐఎంఏ) వెల్లడించింది. కేవలం ఒక్క బీహార్లోనే 115 మంది చనిపోగా, ఢిల్లీలో 109 మంది డాక్టర్లు కరోనా మహమ్మారికి బలయ్యారని తెలిపింది. ఇక తొలిదశ విజృంభణ సమయంలోనూ కరోనా కారణంగా 748 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఐఎంఏ రిజిస్ట్రీలో పేర్కొంది.సెకండ్ వేవ్ సమయంలో ఉత్తర్ప్రదేశ్లో 79, పశ్చిమ బెంగాల్లో 62, రాజస్థాన్లో 43, జార్ఖండ్లో 39, ఆంధ్రప్రదేశ్లో 38 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఐఎంఏ వెల్లడించింది. ఇలా దేశవ్యాప్తంగా కేవలం సెకండ్ వేవ్ సమయంలో ఇప్పటివరకు మొత్తం 730 మంది వైద్యులు కన్నుమూశారని పేర్కొంది. దేశంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు, కోవిడ్ మరణాలు చోటుచేసుకున్న మహారాష్ట్రలో 23 మంది డాక్టర్లు మృతిచెందారు. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న కర్నాటకలోనూ 9మంది చనిపోయారు.