Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరుగురు మావోయిస్టులు మృతి
విశాఖ : ఏపీలోని విశాఖ జిల్లా కొయ్యూరు మండలం మంప పోలీస్టు స్టేషన్ పరిధిలోని తీగలమెట్ట వద్ద గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో మంప పీఎస్ పరిధిలో పోలీసులు కూంబింగ్ చేపట్టారన్నారు. ఈ క్రమంలో తెల్లవారుజామున ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగినట్టు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో చనిపోయిన, గాయపడిన వారి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి సమయం పడుతుందని తెలిపారు. ఈ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతున్నదని చెప్పారు. అదనపు బలగాలను తరలించామన్నారు. ఎన్కౌంటర్లో డీసీఎం కమాండర్ సందె గంగయ్య మతిచెందినట్టు పోలీసులు తెలిపారు.