Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కష్టజీవుల ఐక్యత వర్ధిల్లాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆకాంక్షించింది. వ్యవసాయ చట్టాలను, విద్యుత్ బిల్లును రద్దు చేయాలని కోరుతూ ఎస్కేఎం చేపట్టిన ఆందోళనకు సీఐటీయూ తదితర కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక మద్దతును స్వాగతిస్తూ ఎస్కేఎం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గత మే నెల 26న ఎస్కేఎం ఇచ్చిన కార్యాచరణ పిలుపు మేరకు లక్షలాది మంది కార్మికులు పాల్గొని జయప్రదం చేశారని, అదే విధంగా దేశవ్యాప్తంగా ఈ నెల 26న చేపట్టనున్న 'సేవ్ అగ్రికల్చర్, సేవ్ డెమోక్రసీ' డేకి కూడా కేంద్ర కార్మిక సంఘాలు మద్దతివ్వడం రైతులు- కార్మికుల ఐక్యతను ఇనుమడింపజేస్తోందని తెలిపింది. కార్మిక కోడ్లను రద్దు చేయాలని కార్మికులు సాగిస్తున్న పోరాటానికి ఎస్కేఎం కూడా సంఘీభావాన్ని ప్రకటించింది.