Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 100 పోస్టులకు 1.6 లక్షలకు పైనే దరఖాస్తులు.. కటాఫ్ 84 శాతానికి పైనే
న్యూఢిల్లీ: దేశంలో మహిళా మిలిటరీ పోలీసు ఉద్యోగాలకు రికార్డు స్థాయిలో డిమాండ్ పెరిగింది. ఆర్మీలోకి జనరల్ డ్యూటీ (మిలిటరీ పోలీస్ కాప్స్)లో 2019 నుంచి మహిళలను తీసుకుంటున్నారు. ప్రతియేడాది 100 మందిని రిక్రూట్ చేసుకుంటున్నారు. మొదటి సారి (2019)లో మహిళల నుంచి దరఖాస్తులకు కోరింది. సెకండరీ పరీక్షలో కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులు కావడంతో పాటు ప్రతి సబ్జెక్టులో 33 శాతం మార్కులను దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ప్రమా ణాలుగా పేర్కొంది. కేవలం 100 పోస్టులే ఉండగా.. వాటి కోసం 1.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. షార్ట్‌లిస్టు అభ్యర్థుల కటాఫ్ 86 శాతానికి పైగా ఉంది.2020లోనూ 100 పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులను కోరగా భారీ స్థాయిలలోనే అప్లికేషన్లు వచ్చాయి. కటాఫ్ 84 శాతానికి పైగా ఉంది. ఇదే విషయం పై ఆర్మీకి చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ''మహిళల నుంచి ఆర్మీ ఉద్యోగాల కోసం డిమాండ్ అధికంగా ఉంది. గత రెండేండ్ల నోటిఫికేషన్లకు 1.6 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందుకే కటాఫ్ శాతాన్ని 86, 84 శాతంగా నిర్ణయించాల్సి వచ్చింది'' అని తెలిపారు. ప్రయివేటులో జాబ్ మార్కెట్ ఉత్తమంగా లేకపోవడం, నిరుద్యోగం అధికంగా ఉండటం, ప్రభుత్వ ఉద్యోగంతో ఉన్న భద్రత సహా ఇతర ప్రయోజనాల కారణంగా దరఖాస్తులు అధికంగా రావడానికి కారణాలని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ ఏడాది కూడా ఇండియన్ ఆర్మీ ఉమెన్ సోల్జర్స్ కోసం దరఖాస్తులను కోరింది. అప్లై చేసుకోవడానికి చివరి తేది జులై 20.