Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఏఏను వ్యతిరేకించినందుకు ఉపా చట్టంకింద అరెస్ట్
- ఢిల్లీ హైకోర్టు ఆదేశంతో విముక్తి
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకించినందుకు కేండ్రంలో మోడీ ప్రభుత్వం క్రూరమైన యూఏపీఏ చట్టం కింద అరెస్టు చేసి జైలులో పెట్టిన ముగ్గురు విద్యార్థి నేతలు గురువారం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఢిల్లీ హైకోర్టు రెండు రోజుల క్రితమే వీరికి బెయిలు మంజూరు చేసినా, ఢిల్లీ పోలీసులు తమ కస్టడీలోనే ఉంచింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందిస్తూ, వీరిని తక్షణమే విడుదల జేయాలని తాజాగా మరో ఆదేశం జారీ చేసింది. దీంతో వీరిని జైలు అధికారులు విడుదలజేశారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనల సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు నటాషా నర్వాల్, దేవంగణ కలిత, ఆశిఫ్ ఇక్బాల్ తన్హా లను అరెస్టు చేసిన సంగతి విదితమే. వారి షూరిటీలు, అడ్రస్లు ధ్రువీకరణ నిమిత్తం వారిని విడుదల చేసేందుకు కొంత సమయం కావాలని బుధవారం చివరి నిమిషంలో ట్రయల్ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నంలోగా పని పూర్తిచేయాలని గడువునివ్వగా విఫలమవ్వడంతో... కార్యకర్తలు కోర్టును ఆశ్రయించారు. కాగా, చిరునామాలు, షూరిటీలు ధ్రువీకరణ, షూరిటీల విషయంలో (నటాషా నర్వాల్కుసీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కారత్ షూరిటీ ఇవ్వగా... వీరికి షూరిటీనిచ్చిన వారి వివరాలను ధ్రువీకరించడంలో సమయం అవసరమని పేర్కొంటూ) జాప్యం చోటుచేసుకున్నాయని పేర్కొటూ మరింత సమయం కోరారు. ముగ్గురి ఆధార్ వివరాలను వెరిఫై చేయడంలో జాప్యంపై కూడా కోర్టు ప్రశ్నించింది. కాగా, ఉద్దేశపూర్వకంగానే పోలీసులు విడుదలలో జాప్యం చేస్తున్నారని వారి తరపు న్యాయవాది ఆరోపించారు. అదేవిధంగా ఆధార్ నంబర్ వెరిఫికేషన్లో జాప్యమని చెప్పడంపై మండిపడ్డ కోర్టు... అసలు ఇతర కేసుల్లో కూడా ఇటువంటి విధానాన్నే అవలంభిస్తున్నారా అంటూ ప్రశ్నించింది. వీరిని తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది.