Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హింస రెచ్చగొట్టేందుకే : సీపీఐ(ఎం)
తిరువనంతపురం : బీజేపీ నేతల ప్రమేయం వున్న హవాలా కేసులో దర్యాప్తుకు ఆదేశించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు బెదిరింపులు వచ్చాయి. ముఖ్యమంత్రిని హతమా రుస్తామనీ, ఆయన కుటుంబ సభ్యులను బూట కపు కేసుల్లో ఇరికిస్తామని రాధాకృష్ణన్ బెదిరిం చారు. బీజేపీ నేత ఎఎన్ రాధాకృష్ణన్ బహిరంగం గానే ముఖ్యమంత్రిని బెదిరించడాన్ని చూస్తుంటే రాష్ట్రంలో హింస రెచ్చగొట్టడానికి చూస్తున్నారని అర్ధమవుతోందని సీపీఐ(ఎం) తాత్కాలిక రాష్ట్ర కార్యదర్శి ఎ విజయరాఘవన్ తెలిపారు. ఈ ధోరణిని తీవ్ర ఆందోళనతో చూడాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రశాంతంగావున్న వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్న ట్టుగా భావించాల్సి వుంది. ముఖ్యమంత్రి కుటుంబంపై వ్యక్తిగత దాడులకు దిగడా నికి బీజేపీ యత్నిస్తున్నది. బీజేపీ నేతల అవినీతి నుంచి ప్రజల దృష్టిని మళ్లిం చేందుకే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని విజయరాఘవన్ పేర్కొన్నారు. హవాలా కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులను అడ్డగించేందుకు మరో బీజేపీ నేత సురేంద్రన్ ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది.