Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్చించనున్న డిఫెన్స్ ఫెడరేషన్స్
- కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించాలని పిలుపు
న్యూఢిల్లీ : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు (ఓఎఫ్‌బీ)ను కార్పొరేటీకరించాలన్న మోడీ సర్కారు నిర్ణయంపై రక్షణ ఉద్యోగుల సమాఖ్యల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరవధిక సమ్మెకు దిగే విషయంపై డిఫెన్స్ ఫెడరేషన్స్ చర్చించనున్నాయి. ఓఎఫ్‌బీని రద్దుచేసి దానిని ప్రభుత్వ యాజమాన్యంలోని ఏడు కార్పొరేటు సంస్థలతో భర్తీ చేయాలని కేంద్రం యోచిస్తున్నది. ఈ మేరకు దీనికి సంబంధించిన ప్రణాళికను కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించిన విషయం తెలిసిందే.
ఓఎఫ్‌బీకి 246 ఏండ్ల చరిత్ర ఉన్నది. ఈ సంస్థ గొడుగు కింద దేశవ్యాప్తంగా 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. కాగా, ఈ బోర్డును ఏడు కొత్త డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ (డీపీఎస్‌యూ)గా మార్చనున్నట్టు మీడియా నివేదికల సమాచారం. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో మొత్తం 82వేల మంది ఉద్యోగులు ఉన్నారు. కాగా, నాలుగు లక్షల మంది పౌర ఉద్యోగులు కేంద్రం నిర్ణయాన్ని తిరస్కరించారు. ఈ మేరకు గుర్తింపు పొందిన మూడు సమాఖ్యలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి.
కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపండి : డిఫెన్స్ ఫెడరేషన్స్
దేశంలోని జాతీయ భద్రత, రక్షణ సంసిద్ధతపై తీవ్రమైన ప్రభావాన్ని చూపే ఈ దారుణమైన నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, దేశప్రజలకు డిఫెన్స్ ఫెడరేషన్స్ విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు ఆలిండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏఐడీఈఎఫ్), ఇండియన్ నేషనల్ డిఫెన్స్ వర్కర్స్ ఫెడరేషన్ (ఐఎన్డీడబ్ల్యూఎఫ్), భారతీయ ప్రతిక్ష మజ్దూర్ సంఫ్‌ు (బీపీఎంఎస్)లు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.
రెండు రోజులు నిరసన ప్రదర్శనలు
కాగా, కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ యూనిట్లలో రెండు రోజులు స్థానికంగా నిరసన ప్రదర్శనలకు డిఫెన్స్ ఫెడరేషన్స్ పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా శనివారం రక్షణ సంస్థలలో దిష్టిబొమ్మలను దహనం చేయనున్నారు. కాగా, ఈ ఆదివారం కార్మికుల నాయకత్వం సమావేశం కానున్నది. నిరవధిక సమ్మెతో సహా తిరిగి పోరాటం సాగించేందుకు కావాల్సిన పలు నిర్ణయాలను పరిగణలోకి తీసుకోనున్నది. కాగా, మూడు ఫెడరేషన్ల ప్రతినిధులు లేకుండా చీఫ్ లేబర్ కమిషనర్ (సీఎల్సీ) మంగళవారం 'విఫల నివేదిక'ను సమర్పించారని ఏఐడీఈఎఫ్ జనరల్ సెక్రెటరీ సీ. సాయికుమార్ అన్నారు.
నిరవధిక సమ్మెకు గతేడాదే నిర్ణయం
కాగా, 2020లోనే రక్షణ ఉద్యోగులు అక్టోబర్‌లో నిరవధిక సమ్మెకు దిగాలని నిర్ణయించుకున్నారు. ప్రయివేటీ కరణ చర్యను ఉపసంహరించుకోవాలని మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి చేశారు. అయితే, సీఎల్సీ జోక్యం తర్వాత సమ్మె చర్య వాయిదా పడింది. ఫెడరేషన్స్, రక్షణ ఉత్పత్తి విభాగం (డీడీపీ) ల మధ్య చర్చలతో ఒక రాజీ ఒప్పందం కుదిరింది. ఓఎప ˜్బీ ప్రస్తుతం డీడీపీ నియంత్రణలో ప్రభుత్వ విభాగంగా పని చేస్తోంది. దీనిని రక్షణ మంత్రిత్వ శాఖ (ఎంఓడీ) నిర్వహిసు న్నది. అయితే, డీడీపీ ద్వారా ఎంఓడీ ప్రతిసారీ సయోధ్య పరిష్కారాన్ని ఉల్లంఘిస్తోందని ఫెడరేషన్లు ఆరోపించాయి. ఈ మేరకు మార్చి 9న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖ రాశాయి. అదే నెలలో సీఎల్సీకి అధికారిక ఫిర్యాదును చేశాయి.