Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను కార్పొరేటీకరించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న విధ్వంసకర నిర్ణయాన్ని సీఐటీయూ తీవ్రంగా ఖండించింది. మోడీ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 19న దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని రక్షణ రంగ కార్మికుల సమాఖ్యల ఐక్య వేదిక పిలుపివ్వడాన్ని సీఐటీయూ అభినందించింది. ఆ కార్యాచరణ ఆందోళనకు మద్దతిస్తూ కార్మిక సంఘాలు, కార్మికులు సంఘీభావాన్ని ప్రదర్శించి పాల్గొనాల్సిందిగా కోరింది.
ప్రస్తుతం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ బోర్డు కింద 44 ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయి. వీటిని ఏడు ముక్కలుగా విభజించి, కంపెనీల చట్టం కింద ఏడు కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దేశ రక్షణ సన్నద్ధతను సమర్ధవంతంగా ఎదుర్కొనడంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, మరికొన్ని రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు గణనీయంగా దోహదపడుతున్నాయి. మన జవాన్లు ఉపయోగించే పలు పరికరాలను, చిన్న తరహా ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని ఇలా వివిధ మౌలిక అవసరాలను తీరుస్తున్నాయి. పలు ప్రతికూలమైన వాతావరణంలో కూడా పనిచేస్తున్నాయి. మనరక్షణ బలగాల్లో 75 శాతానికి పైగా అవసరాలను ఈ సంస్థలే విజయవంతంగా నెరవేరుస్తున్నాయి. ఇంతటి విశిష్టత కలిగిన సంస్థలను కార్పొరేటీకరించే చర్యల వెనుక గల ఒకే ఒక ఉద్దేశ్యం దశలవారీగా వాటిని ప్రయివేటీకరించడమేనని సీఐటీయూ విమర్శించింది. ఇది కేవలం ప్రయివేటీకరణ చర్య మాత్రమే కాదనీ, బహుముఖ మార్గాల ద్వారా విదేశీ కార్పొరేట్ల ఆధిపత్యంతో కూడిన ప్రయివేటీకరణ చర్య అని వ్యాఖ్యానించింది. గతంలో ఇలాంటి ప్రయత్నాలు జరిగినా అంతిమంగా నాణ్యత గల ఉత్పత్తులను ఉత్పిత్తి చేసి, సరఫరా చేయడంలో దేశీయ ప్రయివేటు సంస్థలు విఫలమయ్యాయి. కేంద్రం తీసుకుంటున్న ఈ చర్యలను రక్షణ రంగ కార్మిక సంఘాలు, సమాఖ్యలు ఐక్యంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ సమయంలో కూడా ఇటువంటి చర్యలకు దిగడమంటే కార్మికులకు ఇచ్చిన హమీని తీవ్రంగా ఉల్లంఘించడమే కాగలదని సీఐటీయూ స్పష్టం చేసింది.
తప్పుడు నిర్ణయం : ఏఐటీయూసీ
మోడీ సర్కారు నిర్ణయాన్ని ఏఐటీయూసీ తప్పుబట్టింది. ఇది ఃతప్పుగా భావించిన నిర్ణయంః అని పేర్కొన్నది. కేంద్రం నిర్ణయాన్ని ఖండిస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. మొత్తానికి ఓఎఫ్బీ ఇక ప్రయివేటు పరం కానున్నదని ఆందోళన వ్యక్తం చేసింది.