Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మరణాల సంఖ్య 3.83 లక్షలకు పైబడి చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 19,29,476 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 62,480 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,97,62,793కు చేరాయి. 24 గంటల వ్యవధిలో 1,587 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు 3,83,490 మంది మహమ్మారికి బలయ్యారు.
ప్రస్తుతం దేశంలో 7,98,656 క్రియాశీల కేసులుండగా.. క్రియాశీల రేటు 2.78 శాతానికి చేరగా.. రికవరీ రేటు 95.93 శాతానికి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 88,977 మంది కోలుకోగా.. మొత్తం రికవరీలు సంఖ్య 2,85,80,647కు చేరాయి. అలాగే గడిచిన 24 గంటల్లో 32,59,003 వ్యాక్సిన్ డోసులు అందించగా, ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 26,89,60,399కి చేరింది.