Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఉద్యమం ఉధతంగా కొనసాగుతుంది. ఆందోళనల్లో భాగస్వామ్యం అయ్యేందుకు భారీగా అన్నదాతల కదులుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు సరిహద్దులకు చేరుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ భారీగా రైతులు సరిహద్దులకు చేరుకుంటున్నారు. రైతు ఉద్యమం శుక్రవారం నాటికి 203వ రోజుకు చేరింది. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాజాహన్ పూర్, పల్వాల్ సరిహద్దుల్లో వేలాది రైతులు ఆందోళనల్లో వందలాది మంది రైతుల భాగస్వామ్యం కొనసాగుతున్నది.
రైతుపై దాడి.. మృతి
రైతుల ఆందోళనల్లో హింస చోటుచేసుకున్నది. ఢిల్లీ సరిహాద్దు టిక్రి సరిహద్దుల్లో నిరసనల్లో పాల్గొన్న ఒక వ్యక్తిపై నలుగురు ద్రావకం పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు పోలీసులు తెలిపారు. మరణించిన రైతు హర్యానాలోని ఝాజర్ జిల్లా బహదూర్‌గఢ్‌లోని కాస్రా గ్రామానికి చెందిన ముకేశ్‌గా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగినప్పుడు నలుగురు నిందితులు తాగిన మైకంలో ఉన్నట్టు ఫిర్యాదుదారు పేర్కొన్నారు. కాగా, ముకేశ్‌కు నిప్పంటించడానికి కారణం ఏమిటనేది తెలియరాలేదు. నిందితులు నలుగురిపై హత్య కేసు నమోదు చేశారు. వీరిలో ఒకరిని హర్యానాలోని జింద్ నివాసిగా గుర్తించారు. కాగా, ముఖేష్ కుటుంబానికి పరిహారం చెల్లించాలంటూ అతని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు..