Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : అదానీ గ్రూపు కంపెనీల్లో హవాలా పెట్టుబడుల మిస్ట్రరీ వివాదంతో ఆ కంపెనీలకు చెందిన షేర్లు దాదాపు రూ.2 లక్షల కోట్లు నష్టపోయాయి. గురువారంతో ముగిసిన నాలుగు మార్కెట్ సెషన్లలోనే ఈ మొత్తం సంపద హరించుకుపోయింది. మారిషస్ కేంద్రంగా ఒకే అడ్రస్‌తో ఉన్న విదేశీ పోర్టుపోలియే సంస్థలు అదానీ గ్రూపులో రూ.43వేల కోట్ల పెట్టుబడులు కుమ్మరిం చాయని.. దీంతో ఆ డొల్ల కంపెనీల కార్యక లాపాలను ఎన్ఎస్డీఎల్ స్తంభింపజేసినట్టు వచ్చిన వార్తలతో సోమవారం నుంచి అదానీ షేర్లు కుప్పకూలాయి. నాలుగు రోజుల్లో అదానీ గ్రూపులోని ఆరు కంపెనీల షేర్లు 7.7 శాతం నుంచి 23 శాతం వరకు పతనమయ్యాయి. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల సంపదను గుర్తించే ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితా ప్రకారం అదానీ నికర విలువ 62.5 బిలియన్ డాలర్లకు పడిపోయింది. వారం ప్రారంభంలో అదానీ నికర విలువ 77 బిలియన్ డాలర్లుగా ఉంది. శుక్రవారం సెషన్లో అదానీ స్టాక్స్ సానుకూలంగా నమోదయ్యాయి.