Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదలకు నగదు బదిలీ చేయాలి
- శిక్షణ వినిమయాన్ని పెంచాలి
- శిక్షణ కేంద్రానికి సీఐఐ సూచనలు
న్యూఢిల్లీ : కరోనా రెండో దశ ఉధతితో ఒత్తిడిలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు జీవసత్వాలు ఇవ్వడానికి ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించాలని పారిశ్రామిక వర్గాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. ఉద్దీపనల క్రింద కనీసం రూ.3 లక్షల కోట్లు ఇవ్వాలని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండిస్టీ (సీఐఐ) సూచించింది. లేకపోతే ఆర్థిక వ్యవస్థను వద్ధి బాట పట్టించడం కష్టమని ఆందోళన వ్యక్తం చేసింది. జన్‌ధన్ ఖాతాలకు నేరుగా నగదు బదిలీ ద్వారా పేదలనూ ఆదుకోవాలని సిఐఐ నూతన జాతీయ అధ్యక్షుడు, టాటా స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్రన్ ప్రభుత్వాన్ని కోరారు. కరోనా 2.0తో ప్రజలపై ఏర్పడిన ఒత్తిడిని తొలగించడానికి తక్షణ కర్తవ్యంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వినియోగ ఆధారితమైందన్నారు. కరోనాతో వినియోగ డిమాండ్ పడిపోయిన నేపథ్యంలో వినిమయాన్ని పెంచేందుకు నగదు బదిలీతో సహా పలు చర్యల్ని తీసుకోవాలని నరేంద్రన్ సూచించారు.
పన్ను భారాలను తగ్గించాలి
''రూ.3 లక్షల కోట్ల అదనపు ఉద్దీపన ఇవ్వడానికి అవకాశం ఉన్నది. ఇందుకు వీలుగా రిజర్వ్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌ను పెంచుకోవడం ద్వారా వడ్డీ వ్యయాల్ని అదుపుచేయవచ్చు. డిమాండ్ పెంపునకు వీలుగా జీఎస్టీని తగ్గించాలి. ఇంధనాలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలి. అలాగే ఇంధనోత్పత్తుల్ని జీఎస్టీలో చేర్చాలి. గహ కొనుగోలుదార్లకు పన్ను ప్రోత్సహకాలు, వడ్డీ రాయితీలు, స్టాంప్‌డ్యూటీ తగ్గింపులను పరిశీలించాలి. వీటితో ప్రజలపై పన్ను భారాలను తగ్గించవచ్చు. ఆత్మనిర్భార్ భారత్ రోజ్‌గార్ యోజనను 2022 మార్చి వరకూ పొడిగించాలి. ఎమర్జెన్సీ క్రెడిట్ గ్యారంటీ స్కీము మొత్తాన్ని రూ.5 లక్షల కోట్లకు పెంచాలి.'' అని నరేంద్రన్ ప్రభుత్వానికి సూచించారు. ''వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడానికి బ్రిటన్ తరహాలో 'వ్యాక్సిన్ జార్'ను నియమించాలి. పూర్తి జనాభాకు ఈ ఏడాది డిసెంబర్‌కల్లా టీకాలు వేయడానికి రోజుకు సగటున 71.2 లక్షల వ్యాక్సిన్ డోసులు అవసరం. వ్యాక్సినేషన్‌ను వేగంగా పూర్తి చేయడానికి బ్రిటన్ తరహాలో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. రెండు డోసుల వ్యాక్సిన్లు వేయించుకున్న వారికి నగదు, ఆహారం, బీమా వంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఉన్నత వర్గాలవారికి దేశీ విమానయానంలో డిస్కౌంట్లు ఇవ్వొచ్చు.'' అని నరేంద్రన్ పేర్కొన్నారు.