Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
- లీటర్ పెట్రోల్‌పై 27 పైసలు, డీజీల్‌పై 28 పైసలు
- బెంగళూరులో తొలిసారి సెంచరీని దాటిన పెట్రోల్ ధర
న్యూఢిల్లీ : దేశంలో పెట్రో ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 27 పైసలు, డీజీల్‌పై 28 పైసల మేర పైకి ఎగబాకాయి. తాజా పెరుగుదలతో గత 46రోజుల్లో పెట్రోధరలు 26సార్లు పైకి ఎగబాకినట్టయ్యింది. దీంతో దేశవ్యా ప్తంగా వాహనదారులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటు న్నారు. చమురు ఉత్పత్తుల ధరలను అదుపు చేయడంలో విఫలమైన మోడీ సర్కా రుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు పెంచిన ధరల ప్రకారం.. దేశంలోని ఆయా ప్రధాన నగరాలు, ప్రాంతాల్లో ఇంధన ధరలు షాకిస్తున్నాయి. బెంగళూరులో తొలిసారిగా లీటర్ పెట్రోల్ ధర సెంచరీని దాటిం ది. ఇక దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.93గా ఉన్నది. లీటర్ డీజీల్ ధర రూ. 87.69కు చేరింది. దేశవాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.08కు ఎగబాకింది. అలాగే, డీజీల్ ధర రూ. 95.14గా నమోదైంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.14గా, డీజీల్ ధర రూ. 92.31కు చేరింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.84, డీజీల్ ధర రూ.90.54కు ఎగబాకింది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ మార్కు ను దాటి రూ. 100.17గా, డీజీల్ ధర రూ. 92.97 గా నమోదైంది. ఇక హైదరా బాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 43 పైసలు పెరిగి ధర రూ. 100.89 కు చేరింది. డీజీల్‌పై 45 పైసలు పెరిగిదాని ధర రూ. 95.73 కు ఎగబాకింది. ఇక రాజస్థాన్ లోని గంగానగర్‌లో పెట్రోల్, డీజీల్ ధరలు దేశంలోనే అత్యధికంగా నమోద య్యాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 108.07కు, డీజీల్ ధర రూ. 100.82 కు ఎగబాకాయి.కాగా, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ పెట్రోల్, డీజీల్ల ధరలు పెంచుతూ మోడీ సర్కారు దేశ ప్రజల నడ్డి విరుస్తున్న దని నిపుణులు ఆరోపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం గతనెల 4 నుంచి దేశంలో పెట్రో ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే.