Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ మాజీ ఆరోగ్య మంత్రి శైలజ కూడా..
- టీకా ఇంటర్నేషనలిజంపై నాలుగు రోజుల శిఖరాగ్ర సమావేశం
న్యూఢిల్లీ : ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ ఫర్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఇంటర్నేషనలిజం నాలుగు రోజుల శిఖరాగ్ర సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. 'అందరికీ వ్యాక్సిన్లను అందించడం ద్వారా సాధ్యమైనంత త్వరగా మహమ్మారిని అంతం చేయడం' ఈ సమావేశం ముఖ్యోద్దేశం. కాగా, ఈ నాలుగు రోజులు సమావేశానికి భారత్ నుంచి కేరళ సీఎం పినరయి విజయన్, రాష్ట్ర మాజీ ఆరోగ్య మంత్రి కేకే శైలజలు పాల్గొంటున్నారు. అలాగే, ఆశా కార్మికుల ప్రతినిధులు, వ్యాక్సిన్ తయారీ దారు విర్చో లాబోరేటరీస్ కార్మికులు ఈ సదస్సులో భాగం అవుతున్నారు. కరోనా మహమ్మారిని అరికట్టే విషయంలో కేరళ రాష్ట్రం దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన విషయం తెలిసిందే. విజయన్, కేకే శైలజల నేతృత్వంలో కేరళలో మహమ్మారి వ్యాప్తిని సమర్థవంతంగా ఎదుర్కొని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. కాగా, ఈ సమావేశంలో 20కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఆరోగ్యకార్యకర్తలు, టీకా తయారీదారులు భాగస్వామ్యం కానున్నారు.