Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చమురు ఉత్పత్తుల ధరల పెరుగుదలపై
- ఉన్నతాధికారులను ప్రశ్నించిన పార్లమెంటరీ ప్యానెల్
న్యూఢిల్లీ : దేశంలో రోజురోజుకూ తీవ్రంగా పెరుగుతున్న చమురు ఉత్పత్తుల ధరలపై ఆ శాఖకు చెందిన పార్లమెంటరీ ప్యానెల్ సభ్యులు.. పెట్రోలియం మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇందుకుగల కారణాలను అడిగారు. పెట్రోలియం, సహజ వాయు వ్యవహారాలపై గల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు పెట్రోలియం సెక్రెటరీ తరుణ్ కపూర్, ప్రభుత్వ సంస్థలైన ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, గెయిల్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలు సాధారణ ప్రజల గృహ బడ్జెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నదని కమిటీ సభ్యులు తెలిపారు. అయితే, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉన్నాయని సదరు మంత్రిత్వ శాఖ అధికారులు ప్యానెల్‌కు తెలిపారు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గినప్పుడు కూడా దేశీయ మార్కెట్లో ధరలు అధికంగానే ఉన్నాయన్న విషయాన్ని కమిటీకి చెందిన ఒక సభ్యుడు గుర్తు చేశారు. దేశంలో ఎన్నికల ఆధారంగా పెట్రో ధరలపై నిర్ణయం తీసుకుంటారని కొంత మంది సభ్యులు అధికారులతో అన్నారు.