Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో 9 ప్రాంతీయ భాషల్లోనూ..
న్యూఢిల్లీ: ట్రాన్స్జెండర్లకు గుర్తింపు సర్టిఫికెట్లు జారీచేసేందుకు ఉద్దేశించబడిన కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వశాఖకు చెందిన ఐడీ పోర్టల్ ఇప్పుడు 10 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చిందని అధికారులు శనివారం తెలిపారు. transgender.dosje.gov.in వెబ్సైట్ ద్వారా అందుబాటులో ఉండే ఈ పోర్టల్‌ను గతేడాది నవంబర్ 25న ప్రారంభించారు. ట్రాన్స్జెండర్ల గుర్తింపు ఐడీ కార్డులు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఈ పోర్టల్ మొదట్లో ఇంగ్లీష్ భాషలో మాత్రమే ఉండేది. శనివారం నుంచి ఈ పోర్టల్ ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబి, తమిళం భాషల్లో అందుబాటులోకి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ పోర్టల్‌ను ప్రారంభించిన నాటి నుంచి బుధవారం వరకు వచ్చిన 2,327 దరఖాస్తుల్లో 1,557 మంది ట్రాన్స్జెండర్లకు గుర్తింపు సర్టిఫికెట్లు మంజూరయ్యాయి.