Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోటిఫై చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: కర్నాటక కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజా ఒక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 15 మంది సభ్యుల గల ఈ బోర్డు తీరప్రాంత పర్యావరణనాన్ని కాపాడడంతో పాటు మెరుగుపరిచేందుకు పనిచేయనుంది. కర్ణాటక కోస్టల్ రెగ్యులేషన్ జోన్(సీఆర్‌జడ్) పరిధిలో పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడం దీని విధి. ప్రాజెక్ట్ ప్రతిపాదన ఆమోదం కోసం దరఖాస్తును స్వీకరించిన తరువాత, ఆమోదించబడిన కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్‌కు అనుగుణంగా ఉండడంతో పాటు 2011 నాటి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఉండే దాన్ని పరిశీలించాలని కేంద్రం ఈ సందర్భంగా పేర్కొంది. సిఆర్‌జడ్ ప్రాంతాల వర్గీకరణతో పాటు, కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్‌లో మార్పులు లేదా సవరణల కోసం కర్నాటక ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి, నిర్దిష్ట సిఫారసును నేషనల్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీకి ఇవ్వాలని తెలిపింది. పర్యావరణ చట్టం-1986లోని నిబంధనలకు అనుగుణంగా కేంద్ర పర్యావరణ మంంత్రిత్వ శాఖ ఈ తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసిందని అధికారులు తెలిపారు. కర్ణాటక కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీకి రాష్ట్ర అటవీ, పర్యావరణ మంంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి అధ్యక్షులుగా ఉంటారు. ఈ బోర్డులోని సభ్యుల పదవీ కాలం మూడు సంవత్సరాలు.