Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: ఎంసెట్ స్థానంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ప్రభుత్వం నిర్వహించే ప్రవేశ పరీక్షలు ( ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ -ఇఎపిసెట్) ఆగస్టు 19వ తేది నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం మీడియాకు వీడియో ప్రకటన పంపారు. ఈఏపీసెట్ నోటిఫికేషన్ను ఈ నెల 24వ తేది విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఆగస్టు 19 నుంచి 25 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. దరఖాస్తులను అభ్యర్ధులు ఆన్లైన్లో జూన్ 26 నుంచి జులై 25వరకు పంపాలనీ, రూ.500ల అపరాధ రుసుంతో ఆగస్టు 5వ తేది వరకు రూ.1000లతో ఆగస్టు 10వరకు, రూ.5వేలతో ఆగస్టు 15వరకు, రూ.10వేలతో ఆగస్టు 18వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఇసెట్, ఐసెట్, పిజిఇసెట్, లాసెట్, ఎడ్సెట్, ఎడ్సెట్, పీఈసెట్లను సెప్టెంబర్ మొదటి, రెండు వారాల్లో నిర్వహిస్తామన్నారు.