Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అత్యుత్తమ పని ప్రదేశాల్లో వరుసగా 15వ ఏడాదిలో ఎన్టీపీసీ మెరుగైన స్థానాన్ని పొందింది. గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్ట్యూట్ ప్రకటించిన ఈ జాబితాలో ఎన్టిపిసి 38వ స్థానంలో నిలిచింది. గతేడాది 47వ స్థానంలో ఉంది. ప్రతీ ఏడాదికేడాదికి తమ సిబ్బంది పనితీరు మెరుగ్గా మారుతుందని ఎన్టీపీసీ పేర్కొంది. మరోవైపు ప్రభుత్వ రంగంలోని ఈ సంస్థ 2021 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 258 శాతం వృద్థితో రూ.4,479 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,252 కోట్ల లాభాలు ఆర్జించింది. ఇదే సమయంలో రూ.27,246 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. గడిచిన మార్చి త్రైమాసికంలో స్వల్పంగా 2.5 శాతం తగ్గి రూ.26,566 కోట్లుగా నమోదైంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో తుది డివిడెండ్ కింద ప్రతీ ఈక్విటీ షేర్‌పై రూ.3.15 అందించడానికి బోర్డు ఆమోదం తెలిపింది.