Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడుగురు విద్యార్థులకు రూ.44లక్షల ప్యాకేజీ
- 740 కంపెనీల నుంచి 9381 ప్లేస్మేంట్ ఆఫర్లు
న్యూఢిల్లీ : క్యాంపస్ రిక్రూట్మెంట్లో వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(విట్) మరోసారి తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. కళాశాల ఆధ్వర్యంలో జరిగిన క్యాంపస్ రిక్రూట్మెంట్లో 740 కంపెనీలు పాల్గొన్నాయని, ఈ కంపెనీల ద్వారా 2021 ఏడాది బ్యాచ్ డిగ్రీ విద్యార్థులకు 9381 ఉద్యోగ అవకాశాలు లభించాయని శనివారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో విట్ యాజమాన్యం తెలిపింది. తమ కళాశాల నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్లో వరుసగా మూడో సంవత్సరం 700కుపైగా కంపెనీలు పాల్గొన్నాయని, వెల్లూరు, చెన్నై, అమరావతి, భోపాల్ క్యాంపస్ విద్యార్థులకు పెద్ద సంఖ్యలో ఈసారి మంచి ఆఫర్లు వచ్చాయని 'విట్' తెలిపింది. రూ.10లక్షలపైన ప్యాకేజీతో కూడిన సూపర్ డ్రీమ్ ఆఫర్లు 1132మంది విద్యార్థులకు వచ్చాయని, మైక్రోసాఫ్ట్, అమెజాన్, పేపాల్..తదితర 100కుపైగా పెద్ద పెద్ద కంపెనీల నుంచి జాబ్ ఆఫర్లు వచ్చాయని, ఏడుగురు విట్ విద్యార్థులకు రూ.44లక్షల ప్యాకేజీ ఇవ్వడానికి మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చిందని విట్ ప్రకటించింది.