Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : కేరళ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు కెకె శైలజా టీచర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతరాత్జీయ పురస్కారం లభించింది. కరోనా విపత్తు సమయంలో ఆమె అందించిన సేవలకు గాను సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ (సీఈయూ) ఓపెన్ సొసైటీ ఫ్రైజ్ 2021కు ఎంపిక య్యారు. ఆర్థిక వేత్త, నోబెల్ గ్రహిత జోసెఫ్ ఇ స్టిగ్లీట్జ్, సాహిత్య నోబెల్ గ్రహీత స్వెత్లానా అలె క్జివిచ్, ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధానకార్య దర్శి కోఫి అన్నన్ తదితర ప్రముఖులు గతంలో ఈ పురస్కారాన్ని పొందినవారిలో ఉన్నారు. ప్రజలందరికీ సమాన అవకాశాలు, సేవలు అందేలా కృషి చేసిన వ్యక్తులకు, సంస్థలకు వార్షికంగా ఈ పురస్కారం అందజేస్తామని సిఒయు ఒక ప్రకటనలో తెలిపింది. కేరళ ప్రజారోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కెకె శైలజ, ఆమె నేతృత్వంలోని అంకిత భావంతో కూడిన ప్రజారోగ్య సిబ్బంది కోవిడ్ కట్టడి కోసం విశేషమైన సేవలందించారని, సమాజ ఆధారిత ప్రజారోగ్య సేవలు, సమర్థవంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థతో ప్రాణాలు కాపాడవచ్చునని ప్రపంచానికి చాటారని సీఈయూ అధ్యక్షులు, రెక్టార్ మిఛిల్ ఇగ్నాటీఫ్ తెలిపారు. ప్రజా జీవితంలోకి అడుగుపెట్టే యువతకు ఆమె చక్కని ఉదాహరణగా నిలుస్తారని కొనియాడారు.