Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: .దేశంలో శనివారం నాటికి గడిచిన 24 గంటల్లో 19,02,009 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 60,753 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇదే సమయంలో కోవిడ్ కారణంగా మరో 1,647 మంది మరణించారు. శుక్రవారంతో పోల్చితే మరణాల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం మొత్తం కోవిడ్ కేసులు 2.98 కోట్లకు చేరగా..3,85,137 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 7,60,019 మంది కరోనాతో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 2.55 శాతానికి తగ్గింది. గడిచిన 24 గంటల్లో 97,743 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 2.86 కోట్ల మంది వైరస్ నుంచి బయటపడ్డారు. రికవరీ రేటు 96.16 శాతానికి పెరిగింది. మరోపక్క గడిచిన 24 గంటల్లో 33,00,085 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయగా... మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 27కోట్ల మార్కును దాటింది.