Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : లోక్‌జనశక్తి పార్టీ (ఎల్జెపి)లో ముసలం ఇంకా ముగియలేదు. ఆ పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ ఢిల్లీలో జాతీయ కార్యనిర్వాహక సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. బాబాయి పశుపతి కుమార్ పరాస్ నేతృత్వంలో నేతలు తిరుగుబాటు జరిపి, పార్టీ లోక్ సభా పక్ష నేతగా పాశ్వాన్‌ను తొలగించాలని స్పీకర్ ఓం బిర్లాను రాజధానిలో కలిసిన తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే పాశ్వాన్ ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా లేనందున ఆయన సమావేశాన్ని నిర్వహించలేరని పరాస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం ఆరుగురు ఎల్‌జెపికి ఆరుగురు ఎంపిలు ఉండగా..ఐదుగురు తిరుగుబాటు చేసి...తమ నేతగా పరాస్‌ను ఎంపిక చేసిన సంగతి విదితమే. అనంతరం పరాస్ పార్టీతో అనుబంధంగా ఉన్న సంస్థలను, రాష్ట్ర యూనిట్లను రద్దు చేసి..కొత్త జాతీయ కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో పరాస్‌కు విధేయులుగా ఉన్న ఎంపిలను, ఆఫీస్‌బేరర్లను చేర్చారు. దీనికి కౌంటర్‌గా ఆయన జాతీయ కార్యనిర్వాహక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఎల్జెపి రెండుగా చీలినప్పటికీ...పాశ్వాన్‌కు అనుకూల అంశాలున్నాయని ఆయన మద్దతుదారులు చెబు తున్నారు. జాతీయ కార్యనిర్వాహక సభ్యులలో 90 శాతానికి పైగా మద్దతు తనకు ఉందని పాశ్వాన్ భావిస్తున్నారు. బీహార్‌లో ఆరుశాతం ఓటు బ్యాంకు ఉన్న పాశ్వాన్లు...చిరాగ్‌కు మద్దతు తెలుపుతారని తెలుస్తోంది. బిజెపి నేతలు సైతం పాశ్వాన్ వర్గంలో చిరాగ్‌కే మద్దతు ఎక్కువగా ఉందిన భావిస్తున్నారు.