Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జంటకు రక్షణ కల్పించిన అలహాబాద్ హైకోర్టు
లక్నో: సహజీవనానికి తాము వ్యతిరేకంగా కాదని, అయితే సహజీవనం చేస్తున్న వారిలో ఒకరు అప్పటికే వివాహం అయిన వారయితే.. అటువంటి సమయంలో రక్షణ ఇవ్వలేమని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. సహజీవనంలో ఉండి, ఇటీవల వివాహం చేసుకున్న ఉత్తరప్రదేశ్‌లోని బదాన్ జిల్లాకు చెందిన ఒక జంటకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశిస్తూ, న్యాయస్థానం తాజాగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా గతంలో ఒక జంటకు రక్షణ కల్పించేందుకు నిరాకరిం చడంపై జస్టిస్ కౌషల్ జయేంద్ర థాకర్, దినేష్ పాథక్లతో కూడిన ధ్విసభ్య ధర్మాసనం స్పష్టత ఇచ్చింది. ''మేం సహజీవన సంబంధాలకు వ్యతిరేకం కాదు. ఇంతకుముందు, ఒక జంట రక్షణ కోరితే దాన్ని మేం తిరస్కరించాం. పిటిషనర్లల్లో ఒకరైన మహిళకు అప్పటికే వివాహం అయింది. ఆమె భర్తను వదిలి, వేరే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. వారి చర్యలు హిందూ వివాహ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయన్న కారణంతో ఆ పిటిషన్‌ను కొట్టేశాం' అని న్యాయస్థానం పేర్కొంది. తాజా జంట విషయానికి వస్తే.. తాము గత కొంత కాలంగా సహజీనం చేస్తున్నామని, ఇరుకుటుంబాల నుంచి బెదిరింపులు వస్తున్న క్రమంలో తమకు రక్షణ కల్పించాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే వీరి పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. పిటిషన్‌పై ఈనెల 18న విచారణ జరిగిన ధర్మాసనం జంటకు రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో ఇద్దరు వివాహ వయసులోనే ఉన్నారని న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కొంది.