Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ చక్కటి ప్రదర్శన: ఎన్ఎఫ్హెచ్ఎస్
న్యూఢిల్లీ : స్కూల్ డ్రాపౌట్లతో భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు పాఠశాల విద్యకు మధ్యలోనే ఫుల్స్టాప్ పెడుతున్నారు. హయ్యర్ సెకండరీలెవల్కు చేరుకోలేక ప్రాథమికస్థాయి విద్యకే విద్యార్థులు పరిమితమవుతున్నారు. ఈ విషయంలో ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ చెత్త ప్రదర్శన కనబర్చింది. సెకండరీ స్కూల్ డ్రాపౌట్లు గుజరాత్‌లోనే అధికంగా ఉన్నాయి. అలాగే అసోం, పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాలూ అదే బాటలో నడుస్తున్నాయి. ఇక ప్రాథమిక స్థాయితో పాటు హయ్యర్ సెకండరీ లెవల్లోనూ అత్యధిక మంది విద్యార్థుల నమోదుతో కేరళ రాష్ట్రం చక్కటి ప్రదర్శన కనబర్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందు వరుసలో నిలిచింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) సమాచారంలో ఈ విషయం వెల్లడైంది. ఈ సర్వే సమాచారాన్ని ఇటీవలే విడుదల చేశారు.ఈ సమాచారం ప్రకారం.. గ్రామీణ కేరళలో దాదాపు 90.8 శాతం మంది బాలురు హయ్యర్ సెకండరీ లెవల్‌కు చేరుకుంటున్నారు. ఇక బాలికల విషయానికొస్తే ఇది 93.6శాతంగా ఉన్నది.