Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం ఆమోదిస్తూ డ్రాఫ్ట్ నోట్!
న్యూఢిల్లీ : భారత్‌లో ప్రభుత్వ రంగ చమురు సంస్థల ప్రయివేటీకరణకు మోడీ సర్కారు బాటలు వేస్తోందా? ఇందులోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)కు ప్రణాళిక చేస్తోందా? అంటే అవుననే సమాధానలు వినబడుతున్నాయి. ప్రభుత్వరంగం చమురు సంస్థల్లో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతించాలనే ప్రతిపాదనపై వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా నోట్‌ను విడుదల చేసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, దీనిని కేంద్ర క్యాబినేట్ ఆమెదించినట్టయితే భారతదేశపు రెండో అతిపెద్ద చమురు శుద్ధిదారు భారత్ పెట్రోలియం కార్ఫ్ లిమిటెడ్ (బీపీసీఎల్)ను ప్రయివేటీకరించడానికి దోహదం చేస్తుంది. కాగా, ప్రస్తుతం బీపీసీఎల్ ప్రయివేటీకరణలో భాగంగా సంస్థలో మొత్తం 52.98 శాతం వాటానే మోడీ సర్కారు విక్రయిస్తోంది.