Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కోవిడ్-19 తీవ్రతను తగ్గించడానికి మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. ప్రజారోగ్యం, సామాజిక చర్యలతో పాటు కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంత చేయాలని ఆగెయాసియా దేశాలకు సూచించింది. టెస్ట్, ట్రేస్, ఐసోలేట్ ప్రక్రియలో మన ప్రయత్నాలను తరచూ బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని డబ్లూహెచ్ఓ ఆగేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేట్రపాల్సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. సరైనరీతిలో మాస్కులను ధరించడం, భౌతిక దూరాన్ని, పరిశుభ్రతను పాటించడం వంటి చర్యలను కఠినంగా అమలు చేయాలని చెప్పారు. వేరియంట్ల ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో వీటిని కఠినంగా, దీర్ఘకాలిక సమయంలో పాటించాల్సిన అవసరం ఉన్నదని పూరమ్ ఖేట్రపాల్ తెలిపారు. కోవిడ్ వ్యాప్తిని తగ్గించి, ప్రజల ప్రాణాలను రక్షించడానికి ఈ చర్యలు దోహదం చేస్తాయని చెప్పారు.