Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీం ముందు కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ: కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల నష్ట పరిహారాన్ని ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనాతో చనిపోయిన మృతుల కుటుంబాలకు విపత్తు నిర్వహణ చట్టం కింద ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులు పిల్ దాఖలైంది. దీనిపై కేంద్రం స్పందిస్తూ.. ప్రకృతి వైపరీత్యాల విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం.. కరోనా మృతుల కుటుంబాలకు నష్ట పరిహారాన్ని చెల్లించలేమనీ, అది కేవలం ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తేనో లేదా వరదలు లాంటివి వస్తేనో ఇవ్వగలమని స్పష్టం చేసింది. ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు దాదాపు కరోనా కారణంగా 4 లక్షల మంది చనిపోయారు. ఆయా కుటుంబాలకు పరిహారం ఇస్తే.. కోవిడ్-19 సహాయ నిధులు సరిపోవని కేంద్రం పేర్కొంది. ఒకవేళ పరిహారం అందిస్తే.. మనుముందు కరోనా సంబంధిత అవసరాలకు నిధులు లేకుండా పోతాయనీ, కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చెల్లించడమనేది రాష్ట్ర ప్రభుత్వాలకు శక్తికి మించిన భారంగా మారుతుందని తెలిపింది. ఒకవేళ కరోనాకు చెల్లించి.. ఇతర వ్యాధుల మరణాలకు నిరాకరించడం అన్యాయమవుతుందని కేంద్రం పేర్కొంది.