Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలు గిలగిలా కొట్టుకున్నా బేఖాతర్
- పన్నుల రాబడి బాగున్నా..తగ్గిన ప్రభుత్వ వ్యయం
- గత ఏడాది ఏప్రిల్‌లో రూ.3.07లక్షల కోట్లు ఖర్చు..
- ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.2.26లక్షల కోట్లు విడుదల
- మొత్తం బడ్జెట్ నిధుల్లో 26.2శాతం తగ్గుదల : సీజీఏ
న్యూఢిల్లీ : దేశంలో ప్రజలంతా కరోనా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నా...కేంద్ర ప్రభు త్వానికి రికార్డుస్థాయిలో పన్ను వసూళ్లు నమోద య్యాయి. అయినా కూడా కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రజల కోసం ఖర్చుచేయడానికి మోడీ సర్కార్‌కు మనసురాలేదు. 'కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఎకౌంట్స్' తాజాగా విడుదల చేసిన గణాంకాలే ఇందుకు నిదర్శనం. గత ఏడాది (2020-21) వార్షిక బడ్జెట్ అంచనాలో 10శాతం (రూ.3,07,060కోట్లు) నిధుల్ని ఏప్రిల్, 2020లో కేంద్రం వ్యయం చేసింది. అదే ఈ ఏడాది బడ్జెట్ (2021-22) అంచనాలో 7శాతం (రూ.2,26,690కోట్లు) నిధుల్ని ఏప్రిల్ లో కేంద్రం ఖర్చుచేసింది. సంక్షోభ సమయాన, అందునా..పన్ను వసూళ్లు రికార్డుస్థాయిలో ఉన్నా..కేంద్ర ప్రభుత్వ వ్యయం తగ్గటం పట్ల ఆర్థిక నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమంపై పెద్ద మొత్తంలో కోతలు విధించటం వల్లే ప్రభుత్వ వ్యయం తగ్గిందని, ఇది సరైన విధానం కాదని వారు విమర్శించారు. గత ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వ వ్యయం 26.2శాతం తగ్గింది. 2017, 2018, 2019 సంవత్సరాలతో పోల్చి చూస్తే..సగటు వ్యయం రూ.2,40,000గా ఉంది. దీనికన్నా తక్కువగా 2021 ఏప్రిల్‌లో కేంద్రం వ్యయం(రూ.2.26లక్షల కోట్లు) చేసింది. సంక్షోభ సమయాన ఆర్థిక పరిస్థితి చక్కదిద్దడా నికి ఉన్న మంచి అవకాశం...ప్రభుత్వ వ్యయాన్ని పెంచటమే. సంక్షేమ, అభివృద్ధిరంగాల్లో ప్రభు త్వం చేసే నిధుల వినియోగం..అది ప్రజల కొను గోలు శక్తిని పెంచుతుందని, ఆర్థిక మాంద్యం నుంచి బయటపడొచ్చునని ఆర్థిక నిపుణులు ఎప్పట్నుంచో సూచిస్తున్నారు. అయితే ఈ సూచనలు, సలహాల్ని మోడీ సర్కార్ పాటిస్తున్నట్టుగా కనపడటం లేదు.
కేంద్ర పథకాలు (బడ్జెట్ అంచనా వ్యయం) ఏప్రిల్, 2020 ఏప్రిల్, 2021
- పీఎం కిసాన్నిధి యోజన, ఫసల్‌బీమా యోజన, క్రిషి సంచరు, 18శాతం 4శాతం
కిసాన్ క్రెడిట్ కార్డ్.
- ప్రజాపంపిణీ, గరీబ్ కల్యాణ్ అన్నయోజన 16శాతం 15శాతం
- జాతీయ విద్యా కార్యక్రమం, సర్వశిక్షా అభియాన్, 5శాతం 3శాతం
- రాష్ట్రీయ శిక్షా అభియాన్, మధ్యాహ్న భోజనపథకం.
- మైనార్టీల స్కాలర్షిప్స్, మౌలానా ఆజాద్ నేషనల్ 5శాతం సున్నా శాతం
ఫెలోషిప్, స్కాలర్షిప్స్
- ఉపాధి హామీ చట్టం, పీఎం ఆవాస్ యోజన, 31శాతం 3శాతం
- దీన్‌దయాళ్ అంత్యోదయ, జాతీయ గ్రామీణ
జీవనోపాధి మిషన్
- స్కాలర్షిప్స్ పథకాలు, పీఎం ఆదర్శ్ గ్రామ్‌యోజన 2శాతం సున్నాశాతం
- గిరిజన సంక్షేమం, అటవీ ఉత్పత్తులకు ఎంఎస్పీ, 5శాతం సున్నాశాతం
గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి
- అంగన్వాడీ సేవలు, పోషన్ అభియాన్, 5శాతం సున్నాశాతం
బాలల సంరక్షణ, సంక్షేమం పథకాలు
- మొత్తం వ్యయం 10శాతం 7శాతం