Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోట్లు ఖర్చు చేసినా మునుగుతున్న మోడీ నియోజకవర్గం
- దేశప్రధాని ప్రాతినిధ్యం వహించే నగరంలో అవస్థలు
- స్మార్ట్‌సిటీ కాదు.. జలగండం తప్పేదెపుడు..!
- గుజరాత్వైపే దృష్టిపెడితే ఎలా? : ప్రశ్నిస్తున్న నియోజకవర్గ ప్రజలు
దేశ ప్రధాని ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గమంటే.. ఒక మోడల్‌గా తీర్చిదిద్దుతారు. అన్ని విధాలా తమ నగరం అభివృద్ధిచెందుతుందని భావించి అక్కడి ప్రజలు మోడీకి ఓటు వేశారు. గెలిపించారు. కానీ బనారస్ నియోజకవర్గంలో వర్షాకాలం వస్తే చాలు.. అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. 'బనారస్ పట్నం చూడరా బాబు..' అని స్థానికులు అంటున్నారు. బయట అడుగుపెడితే చాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి. కోట్లు గుమ్మరించినా.. అక్కడ స్థానిక సమస్యలకు పరిష్కారం లభించటంలేదు.? మీరు గుజరాత్వైపే దృష్టిపెడితే.. మా పరిస్థితి ఎంటని స్థానిక జనం బనారస్ నియోజకవర్గ ఎంపీ నరేంద్రమోడీని ప్రశ్నిస్తున్నారు.
వారణాసి : వర్షపు నీటిలో బనారస్ పట్టణం మునిగితేలుతున్నది. ప్రధాని మోడీ పార్ల మెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో గత నాలుగురోజుల నుంచి వర్షం కురుస్తున్నది. ఇక్కడ కొద్దివానకే... వర్షపు నీరు దానికి మురుగునీరు కలిసి రోడ్లపై నిలిచి పోతున్నది. దీంతో స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. రాజ్‌బందర్, నిబురియా, బజార్దిహా, సారైయాలలో పడవలు వినియోగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పోలీస్ లైన్, పోలీస్ హౌస్, పోలీస్ గ్రౌండ్, పోలీస్ క్లబ్ హౌసింగ్, జిల్లా రిటైర్మెంట్ ఆఫీస్, జిల్లా బేసిక్ ఆఫీసర్ కార్యాలయంతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో వర్షపు నీరు చేరు తున్నది. దీనివల్ల ప్రభుత్వవిధులకు ఆటంకం కలుగుతు న్నది. ఇప్పుడే ఇలా ఉంటే రుతుపవనాలు మరింతగా విజృం భిస్తే కష్టాలు తప్పవని సామాన్యజనం భయపడుతున్నారు.
సరైన మురుగునీటి వ్యవస్థలేకనే..
చిన్న వర్షానికి బనారస్ నియోజకవర్గం చిత్తడిగా మారిపో తున్నది. సరైన నీటి పారు దల వ్యవస్థ లేకపోవడంతో ఇండ్లు, దుకా ణాల్లో నీరు ముంచెత్తుతున్నది. బడి గైబీ, జక్కా, మోతీజీల్, సిస్ నాగ్వా, చపర్హియా పోఖారీ, మక్దూమ్ బాబా, దేవ్ పోఖారీ, అంబా పోఖారీ, అహ్మద్ నగర్, జక్కా స్మశానవాటిక, ఆకాశ్వని మోర్, హనుమాన్ మందిర్ గ్రౌండ్, శివపూర్వా ఇలా చాలా ప్రాంతాల్లో నివసిస్తున్న పేద కుటుంబాలు పడుతున్న ఇబ్బందులు వర్ణానాతీతం.
నేతకార్మికులకు కడగండ్లు
ఇక్కడ అత్యధికమంది ప్రపంచ ప్రఖ్యాతమైన బనారస్ చీరలు, చేతివృత్తులపై ఆధారపడి వున్నారు. కొనియా, సామ్నే ఘాట్, డోమ్రీ, నాగ్వా, రమ్నా, బాన్పూర్వా, షుల్తాం కేశ్వర్, ఫుల్వేరియా, సుబర్బార్వా, నఖిఘాట్, సారయ్య వంటి గ్రామాల్లో వర్షపు నీరు నేత కార్మికులు, చేతివృత్తులపై బతుకుతున్న కుటుంబాల ఉపాధిని దెబ్బతీస్తున్నది. సారయ్య, నక్కి ఘాట్, బజార్దిహాలో కురుస్తున్న వర్షాలతో చీరల నేయటం ఆగిపోయింది. అంతకుముందు నుంచి లాక్డౌన్, ఇపుడు వర్షాలు వెరసి సుమారు 50వేల మంది జీవనోపాధిపై ప్రభావంపడుతున్నది.
రైల్వేఉద్యోగుల్లోనూ వర్షపు ఆవేదన
వారణాసి నగరంలోని రెండు రైల్వే డివిజన్లలోని డజనుకు పైగా కాలనీలు ఉన్నాయి. రైల్వే ఉద్యోగులంతా గత ఏడాదినుంచి ఇండ్లకే పరిమితమయ్యారు. వర్షం పడితే చాలు.. రైల్వే కాలనీల్లో మురుగునీరు ప్రవహిస్తున్నది. దీంతో అక్కడ పరిస్థితి దారుణంగా తయారవుతున్నది. సరైన మురుగునీటిపారుదల వ్యవస్థలేకపోవటంవల్లే సమస్యగా మారిందని రైల్వే ఉద్యోగులు చెబుతున్నారు. గత ఏడేండ్ల నుంచి నిధులు నీటిలాగా ఖర్చుపెడుతున్నా బనారస్ నీటి కష్టాలకు పరిష్కారం లభించటంలేదని స్థానికులు అంటున్నారు.
ప్రణాళికలేని అభివృద్ధి
బనారస్‌లోని మైదాగిన్ నుంచి చౌక్ వరకు ఉన్న పేవ్ మెంట్‌ను అభివృద్ధి చేయటానికి కాలువ తవ్వారు. కొన్నాళ్లకే అది కూలిపోయింది. లక్నో-బనారస్ జాతీయ రహదారి, పాండేపూర్-పంచకోసి రహదారిపై మొదటి ఇంటర్‌లాకింగ్ ఇటుక పేవ్మెంట్ తయారు చేశారు. ఇంకొవైపు పాత నగరాన్ని గ్యాస్ పైపులు, భూగర్భ విద్యుత్ లైన్లు వేయడానికి మళ్ళీ తవ్వారు. ఇలా దశాబ్ద కాలంగా బనారస్‌లో తవ్వకాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రోడ్లు నామరూపాల్లేకుండా పోయాయి. ప్రభుత్వశాఖల మధ్య సమన్వయం కొరవడటం, ప్రణాళి కబద్ధంగా లేని అభివృద్ధి వల్ల బనారస్ ప్రజలు నానా యాతన పడుతున్నారు.
లోపాలు గుర్తించినా.. ఎందుకీ నిర్లక్ష్యం..
బనారస్‌లో ప్రాథమిక సౌకర్యాల కోసం చేసిన పథకాలపై జల్ నిగమ్ అధికారుల పని తీరును ప్రముఖంగా ప్రస్తావించవచ్చు. ఈ శాఖ అధికారులు 2009లో ప్రతిపాదించిన తుఫాను నీటి పారుదల వ్యవస్థను 2015లో పూర్తి చేసినట్టు పేర్కొనటం విశేషం. ఇక జల్ నిగమ్ తన ప్రణాళికను మునిసిపల్ కార్పొరేషన్‌కు అప్పగించి చేతులు దులుపుకోవాలనుకుంటున్నదని అధికారుల వాదన. అయితే ఇటీవల అదనపు మునిసిపల్ కమిషనర్ దేవిదయాల్ వర్మ నేతృత్వంలో తుఫాను నీటి పారుదల వ్యవస్థ తీరుతెన్నులపై సాంకేతిక పరీక్షలు జరిపినప్పుడు 28 ప్రదేశాలలో పెద్ద లోపాలు ఉన్నట్టు గుర్తించారు.
15వ ఆర్థికసంఘం నుంచి 14 కోట్లు..
పైప్‌లైన్‌ను శుభ్రపర్చటం, డ్రైనేజీ వ్యవస్థలోని ఇబ్బందులను తొలగించడానికి 15వ ఫైనాన్స్ నుంచి రూ.14 కోట్లు కేటాయించారు. భూగర్భపైపులు, రహదారి వెడల్పు పనులతో తుఫాను నీటిపారుదల వ్యవస్థ దెబ్బతిన్నదనీ, వర్షాకాలంలో కష్టాలకు కారణమవుతున్నా యని అధికారులు చెబుతున్నారు.
ప్రణాళికలు సరే..
బనారస్వో 2009లో తుఫాను నీటి పారుదల వ్యవస్థకోసం ప్రణాళిక చేశారు. రూ.253 కోట్లు వెచ్చించి.. నగరమంతా సుమారు 76 కిలోమీటర్ల పైప్‌లైన్ వేయాలని నిర్ణయించారు. ఈ ప్రణాళిక 2015లోనే పూర్తయి.. ఆరేండ్లయినా జల్ నిగమ్ ఇంకా మునిసిపల్ కార్పొరేషన్‌కు అప్పగించలేదు. ఇలా నిధులు వెచ్చించినా నిరూపయోగంగా మారాయన్న వాదన వినిపిస్తున్నది. మరోవైపు షాహినాలాకు మ్యాప్కూడా లేదు.
2016లో మోడీ ఎంపీ అయ్యాక.. ఈ కాలువ శుభ్రపర్చే పనులను జపాన్ కంపెనీ జైకాకు అప్పగించారు. రోబోటిక్ కెమెరాతో నాలుగేండ్లుగా శుభ్రపరుస్తున్నా..ఇప్పటికీ పనులు పూర్తికాలేదు.