Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ధ్రువీకరించిన వైద్యులు : డబ్ల్యూహెచ్‌వో ఆందోళన
భోపాల్: దేశంలో ఇటీవల వెలుగు చూసిన డెల్టాప్లస్ వేరియంట్ యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. చాలా దేశాల్లో రాబోయే కరోనావేవ్లకు కారణం కావచ్చుననీ, భారత్‌లోనూ డెల్టా, డెల్టాప్లస్ వేరియంట్లు కరోనా థర్డ్‌వేవ్‌కు కారణం అయ్యే అకాశాలున్నాయని అంచనాలు న్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో డెల్టాప్లస్ వేరి యంట్ తొలి మరణం నమోదైంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో డెల్టాప్లస్ వేరియంట్‌తో ఓ మహిళ మరణించింది. ఇదిలా ఉండగా, సదరు మృతురాలు టీకా తీసుకోకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయారనీ, డెల్టాప్లస్ బారినపడ్డ మరో నలుగురు టీకాలు తీసుకోడవం వల్ల కరోనాను అధిగమించారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కాబట్టి కరోనా టీకాను ప్రజలం దరూ తీసుకోవాలని సూచించింది. మధ్యప్రదేశ్‌లో ఐదు డెల్టాప్లస్ వేరియంట్ కేసులు గుర్తించగా.. మూడు భోపాల్‌లో, రెండు ఉజ్జయినిలో ఉన్నాయి. మృతురాలి నుంచి తీసుకున్న జీనోమ్ సీక్వెన్సింగ్ ఆధారంగా సదరు మహిళ కరోనా డెల్టాప్లస్ వేరియంట్‌తో చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆమె ఈ ఏడాది మే23న డెల్టా వేరియంట్ బారినపడ్డారు. దేశంలో మొత్తం 40కి పైగా డెల్టాప్లప్ కేసులు నమోదైనట్టు అధికారిక సమాచారం. వీటిని మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, మధ్యప్రదేవ్, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో గుర్తించారు. అధికంగా మహారాష్ట్రలో 21 డెల్టాప్లస్ కేసులు వెలుగుచూడ టంపై రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. డెల్టావేరియంట్ పలు దేశాల్లో తీవ్రంగా వ్యాపిస్తుండటంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
డెల్టా వేరియంట్ ప్రమాదకరం..
కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ఇప్పటికే 85 దేశాల్లో విస్తరించిందనీ, రానున్న రోజుల్లో మరిన్ని దేశాలకు కూడా వ్యాప్తి చెందే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే 170 దేశాలో వేరియంట్ ఆల్ఫా, 119 దేశాల్లో వేరియంట్ బీటా, 71 దేశాల్లో గామా వ్యాపించాయని తెలిపింది. ఈ వేరియంట్లపై నిర్లక్ష్యం వహించరాదని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ముఖ్యంగా భారత్ డెల్టా వేరియంట్ ప్రమాదకరమని తెలిపింది.