Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఏచూరీ కౌంటర్
న్యూఢిల్లీ : భారత్‌లో ఇంధన ధరల పెంపుపై పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇచ్చిన వివరణపై సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం విధించిన ఎక్సైజ్ పన్నే దేశంలో పెట్రోల్ ధరల పెంపుకు ప్రధాన కారణమని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వం పెద్ద ఎత్తున చమురు బాండ్లను వదిలేయడం వల్ల భారీగా అప్పులు మిగిల్చిందనీ, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతుం డటంవల్లే ధరలు పెరు గుతున్నాయంటూ ప్రధాన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై ఏచూరీ స్పందిస్తూ.కేంద్రం చెప్పేవన్నీ కుంటిసాకులని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ వంటి పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని ఎన్నిసార్లు పెంచారో సెలవివ్వాలనీ, ఎక్సైజ్ సుంకం పెంపే వీటి ధరలు ఆకాశాన్ని అంటటానికి ప్రధాన కారణమయ్యాయని ఏచూరి తెలిపారు. ఇప్పటి ప్రభుత్వమంతా గత ప్రభుత్వంపై ఏడ్వడమే సరిపో తున్నదనీ, వారికి దొరికిన ఏకైక సాకు అదేనని విమర్శించారు. ప్రజల ను నిలువునా దోచుకుంటున్నారన్నారు. 'మీరేందుకు పెట్రోలియం ఉత్పత్తుల ఎక్సైజ్ డ్యూటీలను పెంచుతు న్నారు? కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం సమకూర్చడం ద్వారా, ప్రజల జీవితాలను దుర్భరంగా మార్చి... వారిని నిరంతరం ఎందుకు దోచుకుంటున్నారు? ఈ ప్రశ్నలకు మీ వద్ద సమాధానాలు లేవు. మోడీ సర్కార్‌కున్న ఏకైక లక్ష్యం దోపిడీ. ఏదైనా తప్పు జరిగితే గత ప్రభుత్వం పైకి నెట్టేయడమే పనిగా పెట్టుకున్నారు' అని ఏచూరీ ఆగ్రహం వ్యక్తం చేశారు.