Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ, దిల్లకు దూరం తగ్గిస్తాం : ప్రధాని మోడీ
- కాశ్మీర్‌పై ప్రధానితో గుప్కర్ కూటమి నేతల భేటి
- మూడు గంటలపాటు.. మూడు కీలకఅంశాలు
- 8 పార్టీలకు చెందిన 14 మంది నాయకులు హాజరు
-ఎలాంటి హామీ రాలే : యూసుఫ్ తరిగామి, సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌పై 8 పార్టీలు 14 మంది నాయకులతో ప్రధాని మోడీ సమావేశమ య్యారు. మూడు గంటలపాటు.. మూడు కీలక అంశాలపై చర్చకు పిలవగా కాశ్మీర్ నేతలు తమ తమ వాదనలు వినిపించారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావే శంలో జమ్మూకాశ్మీర్ నుంచి ఢిల్లీ, దిల్ (హృదయం)లకు దూరం తగ్గిస్తామని మోడీ చెప్పారు. ఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలతో సహా గుప్కర్ కూటమి నాయకులు పాల్గొన్నారు. వీరితో పాటు హౌంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ కూడా పాల్గొన్నారు.
కాశ్మీర్లో కఠినత అంతమవ్వాలి : మెహబూబా ముఫ్తీ
జమ్మూ కాశ్మీర్ ప్రజలు కోపంగా ఉన్నారు. 2019 ఆగస్టు 5 నుంచి దోపిడీకి గురవుతున్నారు. ఆర్టికల్ 370 ను రాజ్యాంగ విరుద్ధంగా తొలగించారు, ఇది జమ్మూ కాశ్మీర్ ప్రజలకు నచ్చలేదు. మేం దీన్ని పాకిస్తాన్ నుంచి పొందలేదు. మాకు జవహర్లాల్ నెహ్రూ, వల్లభారు పటేల్ ఇచ్చారు. పాకిస్తాన్‌తో మళ్లీ చర్చలు జరపాలి, తద్వారా వారితో నిలిచిపోయిన వాణిజ్యం పునరుద్ధరించబ డుతుంది. కాశ్మీరీలపై కఠినత ఆగిపోవాలి, జైళ్లలోని ఖైదీలను విడుదల చేయాలి. జమ్మూ కాశ్మీర్ ప్రజలు గట్టిగా ఊపిరి పీల్చుకున్నా జైలులో పెడుతున్నారు.
ఆర్టికల్ 370పై మా పోరాటం : ఒమర్ అబ్దుల్లా
ఆర్టికల్ 370 పై కోర్టులో పోరాటం చేస్తామని జాతీయ సమావేశ నాయకుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు. జమ్మూ కాశ్మీర్, కేంద్రం మధ్య విశ్వాసాన్ని పునరుద్ధరించడం మీ బాధ్యత. జమ్మూ కాశ్మీర్‌కు కేంద్రపాలిత హౌదా ఇచ్చారు. ఇది కాశ్మీరీలకు ఇష్టంగా లేదు. హదయ దూరాన్ని తగ్గించాలని ప్రధాని కోరుకుం టున్నారు. కానీ ఒక్క సమావేశం గుండె దూరాన్ని తగ్గించదు. అలాగే ఢిల్లీ దూరా న్ని కూడా తగ్గించదు. జమ్మూ కాశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హౌదా ఇవ్వాలని అన్నారు.
కాశ్మీర్‌కు కట్టుబడి ఉన్నాం : అమిత్‌షా
కాశ్మీర్‌కు కట్టుబడి ఉన్నాం. పార్లమెంటులో వాగ్దానం చేసినట్టుగా రాష్ట్ర హౌదాను పునరుద్ధరించడం. డీలిమిటేషన్. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికల నిర్వహణ. ఇవే కీలకమైనవి. సమావేశం చాలా స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని హౌంమంత్రి అమిత్ షా సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ప్రధాని ముందు ఐదు డిమాండ్లు : కాంగ్రెస్
మొదటిది: జమ్మూ కాశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హౌదా ఇవ్వాలి. సమయం వచ్చినప్పుడు రాష్ట్రత్వం పునరుద్ధరించబడుతుందని హౌంమంత్రి మాకు సభ లోపల హామీ ఇచ్చారు. ఇప్పుడు శాంతి ఉంటే ఇంతకంటే మంచి సమయం మరొకటి లేదు.
రెండవది: ప్రజాస్వామ్యం బలం గురించి మోడీ మాట్లాడతారు. పంచాయతీ, జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో విధనాసభకు ఎన్నికలు కూడా వెంటనే జరగాలి.
మూడవది: మన భూమికి హామీ, ఉపాధి సౌకర్యం ఉండాలని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వాలి.
నాల్గవది: కాశ్మీరీ పండితులు గత 30 సంవత్సరాలుగా ఉన్నారు, వారిని తిరిగి తీసుకురావడం, పునరావాసం కల్పించడం జమ్మూ కాశ్మీర్‌లోని ప్రతి పార్టీ బాధ్యత.
ఐదవ: ఆగస్టు 5 న రాష్ట్రాన్ని రెండు భాగాలుగా విభజించారు. దానిపై అభ్యంతరం చెప్పాం.
ఎలాంటి హామీ రాలే : యూసుఫ్ తరిగామి, సీపీఐ(ఎం)
ప్రధాని మోడీ నుంచి తమకు ఎటువంటి హామీ రాలేదని సీపీఐ(ఎం) నేత యూసుఫ్ తరిగామి అన్నారు. ''సమావేశంలో మా ఆందోళనలు, డిమాండ్లు, ఆకాంక్షలను ప్రధాని, హౌం మంత్రి విన్నారు. జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఇది మంచి ప్రారంభం కావాలని చెప్పాం. ఇప్పటి వరకు తమకు అన్యాయం చేశారు. అదంతా రాజ్యాంగం పరిధిలో లేదని అంటున్నారు. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం హామీ ఇచ్చిన హక్కులూ కొల్లగొట్టారు. రాజ్యాంగ అసెంబ్లీ హామీ ఇచ్చిన ఆ హక్కులను పున: పరిశీలించి.. పునరుద్ధరించాలి.
మంచి వాతావరణంలో సమావేశం : ప్రధాని మోడీ
'జమ్మూ కాశ్మీర్ రాజకీయ నాయకులతో సమావేశం బాగా జరిగింది. ప్రగతిశీల జమ్మూ కాశ్మీర్ వైపు కొనసాగుతున్న ప్రయత్నాల్లో ఒక ముఖ్యమైన దశ. ఇక్కడ అన్ని వైపుల వద్ధి జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్లో అట్టడుగు ప్రాంతాలకు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే మా ప్రాధాన్యత ఎన్నికలు జరిగేలా డీలిమిటేషన్ త్వరగా జరగాలి. జమ్మూ కాశ్మీర్ అభివద్ధి పథానికి బలాన్నిచ్చే ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని జమ్మూ కాశ్మీర్ పొందుతుంది'' అని ప్రధాని అన్నారు. మన ప్రజాస్వామ్యం అతిపెద్ద బలం కూర్చుని అభిప్రాయాలను వ్యక్తం చేయగల సామర్థ్యం. జమ్మూ కాశ్మీర్లో నాయకులకు రాజకీయ నాయకత్వాన్ని అందించాల్సి ఉంది. ప్రజలు, ప్రత్యేకించి యువత, వారి ఆకాంక్షలు సక్రమంగా నెరవేరాలని నేను జమ్మూ కాశ్మీర్ నాయకులకు చెప్పా'' అన్నారు.