Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : ముందస్తుగా పలకరిస్తోన్న వర్షాలతో ఉత్తరప్రదేశ్‌లోని గంగానదిలో నీటి మట్టం పెరుగుతోంది. ఇది ప్రయాగ్‌రాజ్ అధికారులకు తలనొప్పిగా మారింది. నీటి మట్టం పెరగడంతో నదీ తీర ప్రాంతాల్లోని ఇసుక తిన్నెలు కొట్టుకుపోవడంతో అక్కడ పూడ్చిన మృతదేహాలు (కోవిడ్‌తో మృతిచెందినవిగా భావిస్తున్నవి) నీళ్లలో తేలుతున్నాయి. ఇప్పుడు వీటిని బయటకు తీసేందుకు అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది. కొంత మంది సాయంతో నదిలో తేలియాడుతున్న మతదేహాలను బయటకు తీయిస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని వివిధ ఘాట్ల వద్ద దీనికి సంబంధించి స్థానిక జర్నలిస్టులు తీసిన వీడియోలు, ఫొటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోల్లో నీటిలో తెల్లటి శస్త్ర చికిత్స గ్లౌవ్ తొడిగిన మతదేహాన్ని ప్రయాగ్‌రాజ్ మున్సిపల్ సిబ్బంది బయటకు తీస్తున్న దశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవే సంఘటనలు పలు ఘాట్లలో దర్శనమిస్తున్నాయి. వాటిని బయటకు తీసిన తర్వాత అధికారులు దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు.
దీనిపై ప్రయాగ్ రాజ్ కార్పొరేషన్ జోనల్ అధికారి నీరజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ... గత 24 గంటల్లో ఇప్పటి వరకు 40 మృతదేహాలను వెలికితీసినట్టు చెప్పారు. వీటన్నింటికీ విడివిడిగా దహన సంస్కారాలు చేశామని తెలిపారు. ఓ మృతదేహానికి ఆక్సిజన్ ట్యూబ్ ఉండటాన్ని గుర్తించారు. ఈ శవాలన్నీ కుళ్లిపోలేదని, దీన్ని బట్టి చూస్తే ఇటీవల కాలంలో వీటిని పూడ్చినట్టు తెలుస్తోందని అన్నారు. నది ఒడ్డున దహన సంస్కారాలకు సాయం అందిస్తోన్న మేయర్ అభిలాష గుప్తా నంది మాట్లాడుతూ... నదిలో కొట్టుకుపోతున్న ప్రతి మృతదేహానికి అంత్యక్రియలు చేస్తామని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృత సమయంలో యూపీ, బీహార్ గంగానదీ పరివాహక ప్రాంతాల్లోకి వేలాది శవాలు కొట్టుకువచ్చిన సంగతి విదితమే. అంతేకాకుండా నదీ తీరాన ఇసుకలో వేలాది శవాలు పూడ్చిన చిత్రాలు బహిర్గతమయ్యాయి. ఇవన్నీ కోవిడ్‌తో చనిపోయిన వారివని, ఇవన్నీ యూపీ అధికారిక లెక్కల్లోకి రాలేదన్న వార్తలచ్చాయి. కానీ వీటిని తోసిపుచ్చిన యూపీ సర్కార్, నది ఒడ్డున మృతదేహాలను పూడ్చటం ఎప్పటి నుంచో ఉందని సమర్థించుకుంది.